డెలివరీ తర్వాత కొంతమంది మహిళలు(Women Health) మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిని సాధారణంగా ‘మామ్స్ బ్రెయిన్’ అని పిలుస్తారు. బిడ్డ సంరక్షణలో పూర్తిగా నిమగ్నమవ్వడం, నిద్రలేమి, ఆహారంపై శ్రద్ధ తగ్గడం వంటివి దీనికి కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రసవానంతరం బాలింతలు తమ ఆరోగ్యాన్ని(Women Health) నిర్లక్ష్యం చేయకుండా సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. ఆకుకూరలు, తాజా పండ్లు, పప్పుదినుసులు వంటి పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరం బలపడటమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది. ఇలా సమతుల్య ఆహారాన్ని అలవాటు చేసుకుంటే మతిమరుపు, ఇతర శారీరక సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: