వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరి మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే మామిడి పండ్లను తినేవాళ్లు ఆ మామిడి పండ్లు సహజసిద్ధంగా పండినవా లేక కృత్రిమ రసాయన కార్బైడ్ తో పండించిన మామిడి పండ్లా అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. కార్బెట్ తో పండించిన మామిడి పండ్లు ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. రసాయనాలతో పండించిన మామిడి పండ్లు మన ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాయి.

రసాయనాలతో పండించిన మామిడి పండ్లను గుర్తించండి ఇలా..
కార్బైడ్ మామిడితో ఆరోగ్యంపై ప్రభావం
కార్బైడ్ తో పండిన మామిడి పండ్లు డేంజర్ క్యాన్సర్ కారకాలుగా కూడా మారే ప్రమాదం ఉంటుంది. కనుక కార్బైడ్ తో పండించిన మామిడి పండ్లను తినకూడదు. ఇక బయట మామిడి పండ్లు కొనేవాళ్లు ఆ మామిడి పండ్లు కార్బైడ్ తో పండించినవా లేక సహజంగా పండినవా అనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
కార్బైడ్ మామిడికి, సహజంగా పండిన మామిడికి తేడా
కార్బైడ్ మామిడికి, సహజంగా పండిన మామిడికి తేడా ఇదే కార్బైడ్ తో పండించిన మామిడిపండ్లు, పండు మొత్తం ఒకే రంగులో, అక్కడక్కడ ఆకుపచ్చని, నల్లని మచ్చలతో ఉంటుంది. అదే సహజసిద్ధంగా పండిన పండు కాస్త ఎరుపు, పసుపు రంగు కలిసిన మిక్స్డ్ కలర్లో కనిపిస్తుంది. సహజంగా పండిన మామిడిపండ్లను నొక్కితే చాలా సాఫ్ట్ గా, పండిన వాసనతో కమ్మగా అనిపిస్తుంది. అదే కార్బైడ్ తో పండిన మామిడిపండు అంత సాఫ్ట్ గా ఉండదు. వాసన కూడా పండు వాసన రాదు. కార్బైడ్ తో పండిన పండును ఇలా గుర్తించొచ్చు కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను నీళ్లలో వేస్తే అవి నీటిలో తేలుతాయి. అదే సహజసిద్ధంగా పండిన పండ్లు అయితే నీళ్లలో మునుగుతాయి.
Read Also:Health: చిన్నచిన్న విషయాలకే భయపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే