ప్రస్తుత జీవనశైలిలో అధిక బరువు అనేది చాలా మందిని వెంటాడుతున్న సమస్య. వేగంగా జరిగే జీవితం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, వ్యాయామానికి సమయం లేకపోవడం వంటి కారణాల వల్ల బరువు పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు చాలామంది డైట్ ప్లాన్లు, వ్యాయామాలు, ఔషధాలు తీసుకుంటున్నారు. అయితే సహజమైన మార్గాల్లో బరువు తగ్గే పరిష్కారాల కోసం చూస్తున్నవారికి చింతపండు (Tamarind) ఒక అద్భుతమైన దివ్య ఔషధం లాంటిది.

చింతపండు అనేది భారతీయ వంటకాలలో ముఖ్యమైన పదార్థం. అయితే ఇది వంటకాలకే పరిమితం కాదు. ఇందులో దాగి ఉన్న ఔషధ గుణాలు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గించడంలో చింతపండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
చింతపండులోని ముఖ్యమైన పోషకాలు
చింతపండులో పుష్కలంగా ఉండే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా పనిచేస్తాయి. అందులో ముఖ్యంగా:
- విటమిన్లు: విటమిన్ C, E, K, B1, B2, B3, B5, B6
- ఖనిజాలు: ఐరన్, ఫాస్పరస్, జింక్, సోడియం, కాల్షియం
- హైడ్రక్సీ సిట్రిక్ యాసిడ్ (HCA)
- పాలీఫెనాల్స్, ఫ్లవనాయిడ్లు
- ఫైబర్, మంచి కార్బోహైడ్రేట్లు
ఈ పోషకాలు శరీరానికి తక్కువ కాలరీలతో ఎక్కువ శక్తినిచ్చే విధంగా పనిచేస్తాయి.
బరువు తగ్గించడంలో
చింతపండులో ఉండే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ (Hydroxy Citric Acid – HCA) అనే యాసిడ్ కొవ్వు కణజాలాల తయారీకి అవసరమైన ఎంజైమ్‌లను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. దీని ఫలితంగా:
- శరీరంలో కొత్త ఫ్యాట్ నిల్వల ఏర్పాట్లు తగ్గుతాయి.
- ఇప్పటికే ఉన్న ఫ్యాట్‌ను శరీరం శక్తిగా వినియోగించుకుంటుంది.
- ముఖ్యంగా కడుపు, తొడల భాగాల్లోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది
చింతపండులో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లవనాయిడ్లు శరీర మెటబాలిజాన్ని (దహన చర్య) వేగవంతం చేస్తాయి. మెటబాలిజం వేగంగా జరిగితే
- శరీరంలోని ఖాళీ క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి.
- తక్కువ ఆహారం తీసుకున్నా శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది.
- బరువు తగ్గే ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది
చింతపండు జ్యూస్ లేదా పదార్ధాలు తినడం వల్ల ఆకలి తక్కువగా అనిపిస్తుంది. ఇది లేప్టిన్ హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా:
- తరచూ తినాలనే తహతహ అనిపించదు
- మద్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ లైట్‌గా ఉంటారు
- ఓవరీటింగ్ కంట్రోల్ అవుతుంది
వ్యాయామానికి సహాయపడే శక్తివంతమైన పదార్థం
చింతపండు తీసుకోవడం వల్ల శరీరానికి తక్కువ కాలరీలతో ఎక్కువ శక్తి లభిస్తుంది. ఇది వ్యాయామ సమయంలో మోటివేషన్‌ను పెంచుతుంది. వ్యాయామం చేస్తే:
- చింతపండు వల్ల వచ్చిన ఎంజైమ్ బ్లాకింగ్ వల్ల ఫ్యాట్ మరింత వేగంగా కరుగుతుంది
- వర్కౌట్‌లో అధిక కాలం పాటు ఎనర్జీ మెయింటెయిన్ అవుతుంది.
కొలెస్ట్రాల్ మరియు గుండె ఆరోగ్యం
చింతపండు బాడీలో ఉండే ఎల్‌డీఎల్ (LDL – చెడు కొలెస్ట్రాల్) స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా:
- గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది
- బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది
- బరువు తగ్గడంలో సహాయపడే హార్మోన్లు బాగా పనిచేస్తాయి.
జీర్ణ వ్యవస్థ మెరుగుదల
రోజూ చింతపండును తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది:
- మలబద్ధకం నివారిస్తుంది
- ఆమ్లత (acidity), గ్యాస్ సమస్యలు తగ్గుతాయి
- ఆహారంలో పేగుల ద్వారా పోషకాలు బాగా శోషించబడతాయి.
చింతపండును ఎలా తీసుకోవాలి?
ఒక రోజు చింతపండు తీసుకునే సరైన మార్గాలు:
- ఉదయం గోరువెచ్చని నీటిలో చింతపండు రసం, తేనె కలిపి తాగడం
- చింతపండు జ్యూస్‌లో జీలకర్ర, మిరియాల పొడి కలిపి తీసుకోవడం
- వంటల్లో చింతపండు పులుసు, చారు వంటివి చేర్చడం
- చింతపండు చట్నీ లేదా చింతపండు నూనెతయారు చేసే పదార్థాల్లో భాగం చేయడం.
Read also: Bottle Gourd: మీకు షుగర్ ఉందా?ఏ విధంగా అయినా సొరకాయ మంచిది