వెండి కేవలం ఆభరణం మాత్రమే కాదు. వెండి కేవలం అందం కోసం వాడే లోహం కాదు, అది ఆరోగ్యం, శక్తి, సంప్రదాయంతో ముడిపడి ఉంది. మన సంస్కృతిలో వెండికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వెండిలో సహజమైన చల్లదనం ఉంటుంది. వెండి ఆభరణాలు (Silver jewelry) ధరించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది, అందుకే చాలామంది వెండి ఉంగరం లేదా గొలుసు వాడతారు. ఇది శరీరంలోని ప్రతికూల శక్తిని గ్రహించి, సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతారు. దీనివల్ల అలసట తగ్గి, శరీరం మరింత ఉత్సాహంగా అనిపిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం, వెండి చంద్రుడిని సూచిస్తుంది. వెండి ధరించడం (Silver jewelry) వల్ల చంద్రుడు బలపడతాడని నమ్ముతారు. బలమైన చంద్రుడు మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తారు. మీ భావోద్వేగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాడు. అందుకే వెండి ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వెండి ధరించడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చంద్రుడు, ఇతర గ్రహాల సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. వెండిని చల్లబరిచే లోహంగా పరిగణిస్తారు. దీన్ని ధరించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీ ఏకాగ్రతను పెంచుతుంది.
Read Also: http://Health Awareness: మనిషి శరీరాన్ని అత్యధికంగా బాధించే నొప్పులు ఇవే

వెండిని పవిత్ర లోహంగా భావిస్తారు. దేవుని పూజలో వెండిని వాడతారు, వెండి తాయెత్తు, ఉంగరం వాడే ఆచారం ఉంది. చెడు దృష్టి నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. వెండిలో యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీనివల్ల చర్మంపై అలెర్జీ ప్రమాదం తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా పిల్లలకు వెండి సురక్షితమైనదిగా భావిస్తారు. మహిళలు వెండి పట్టీలు ధరించడానికి కారణం, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పాదాల్లో వేడి తగ్గుతుంది, కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది. వెండికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణం మీ శరీరాన్ని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అందువల్ల, వెండి ధరించడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నివేదికల ప్రకారం..వెండికి ఇతర గ్రహాల నుండి సానుకూల శక్తిని ఆకర్షించే సామర్థ్యం ఉంది. వెండి ఉంగరం ధరించడం వల్ల చంద్రుని నుండి, ఇతర గ్రహాల నుండి సానుకూల శక్తిని ఆకర్షించడంలో మీకు సహాయపడుతుంది. వెండి సూర్యుని శక్తిని నియంత్రించడం ద్వారా మీ శరీరంలో సమతుల్యతను కాపాడుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: