పిండి వంటలు(Sankranthi) తయారు చేసే సమయంలో నూనె పొంగిపోవడం, వంటలు ఎక్కువగా నూనె పీల్చుకోవడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. అయితే కొన్ని సులభమైన కిచెన్ టిప్స్ పాటిస్తే ఈ సమస్యలు తేలికగా పరిష్కరించవచ్చు. మరుగుతున్న నూనెలో ఒక తమలపాకు వేసి, అది రంగు మారిన వెంటనే తీసివేస్తే నూనె పొంగిపోవడం తగ్గుతుంది.

గారెలు, వడలు మరింత కరకరగా రావాలంటే
గారెలు లేదా వడలు చేసే పిండిలో(Sankranthi) కొద్దిగా సేమియా పొడిని కలిపితే, అవి నూనె ఎక్కువగా పీల్చుకోకుండా కరకరగా తయారవుతాయి.
అరిసెలు పాకం పర్ఫెక్ట్ కావాలంటే
అరిసెలు వండే సమయంలో పాకంలో బియ్యం పిండి తక్కువగా అనిపిస్తే, అవసరానికి తగ్గట్లుగా గోధుమ పిండి కలిపితే సరైన మిశ్రమం వస్తుంది.
సమోసాలు క్రిస్పీగా రావాలంటే
సమోసాలు బయట నుంచి బాగా కరకరగా రావాలంటే, మైదా పిండిలో కొద్దిగా మొక్కజొన్న పిండి కలపడం మంచి పరిష్కారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: