జుట్టు ఆరోగ్యంగా, అందంగా, పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దీని కోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. అయినప్పటికీ కొందరు ఆశించిన ఫలితాలను పొందలేరు. ఎటువంటి ఖర్చు చేసే పనిలేకుండా చాలా సులభంగా, సహజ సిద్దంగా మనం జుట్టు అందాన్ని పెంపొందించుకోవచ్చు. జుట్టు అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు బియ్యం కడిగిన నీళ్లు (Rice Water)ఎంతో సహాయపడతాయి. సాధారణంగా బియ్యం కడిగిన నీటిని(Rice Water) ఎటువంటి అవసరాలకు ఉపయోగించము. కానీ బియ్యం కడిగిన నీటిలో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. జుట్టు సంరక్షణలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. బియ్యం కడిగిన నీటిని వృధా చేయకుండా వీటిని జుట్టుకు మాస్క్ లాగా వేసుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చు.
Read Also: http://Copper Jewellery : రాగి ఆభరణాలను ధరించడం వల్ల ఎన్ని లాభాలో ?

జుట్టు కుదుళ్లు బలపడతాయి
బియ్యం కడిగిన నీటిలో సిస్టిన్ అనే ఆమైనో ఆమ్లం ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే కెరాటిన్ అనే ప్రోటీన్ తయారీలో ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీటిని జుట్టుకు మాస్క్ లాగా వేసుకోవడం వల్ల జుట్టు నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలపడతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతుంది. బియ్యం కడిగిన నీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇనోసిటాల్ అనే కార్బొహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. బియ్యం కడిగిన నీటిని జుట్టు రాయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. బియ్యం కడిగిన నీటిలో ఉండే ఆమైనో ఆమ్లాలు, విటమిన్లు కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. దీని వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. పలుచగా ఉన్న జుట్టు కూడా చిక్కగా తయారవుతుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది
బియ్యం కడిగిన నీటిలో స్టార్చ్, చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడ తాయి. అంతేకాకుండా బియ్యం కడిగిన నీటిని జుట్టుకు మాస్క్ లాగా వేయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. దీంతో జుట్టు సహజ మృదుత్వంతో పాటు మెరుపును కూడా పొందుతుంది. ఈ నీటిని తరచూ ఉపయోగించడం వల్ల జుట్టు ఆకృతి మెరుగుపడుతుంది. బియ్యం కడిగిన నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుండి జుట్టును దెబ్బతినకుండా కాపాడడంలో దోహదపడతాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. పర్యావరణ కాలుష్యం, యూవీ కిరణాల కారణంగా జుట్టు ఎంతో దెబ్బతింటుంది. ఎండలో ఎక్కువగా తిరిగే వారు, బయట పనులు చేసే వారు జుట్టు సంరక్షణకు బియ్యం కడిగిన నీటిని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

చుండ్రు సమస్య తగ్గుతుంది
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తలచర్మం ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా అవసరం. బియ్యం కడిగిన నీటిలో మెగ్ని షియం అధికంగా ఉంటుంది. ఇది చర్మం పిహెచ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. అలాగే ఈ నీటిలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. తలచర్మంపై అదనంగా తయారయ్యే నూనెను, మురికిని తొలగించడంలో ఇవి మనకు సహాయపడతాయి. ఈ విధంగా బియ్యం కడిగిన నీరు జుట్టు సంరక్షణలో ఎంతగానో దోహదపడుతుంది. ఈ నీటిని జుట్టుకు నేరుగా మాస్క్ గా వేయడంతో పాటు జుట్టుకు వేసే వివిధ మాస్క్ లలో కూడా ఈ నీటిని కలిపి వాడుకోవచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: