పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదగాలంటే పుట్టిన తర్వాతే కాదు, గర్భధారణ(Pregnancy Nutrition) సమయంలో నుంచే తల్లి సరైన ఆహారం, జీవనశైలి పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భంలోనే పిల్లల మెదడు అభివృద్ధి ప్రారంభమవుతుందనీ, ఈ దశలో తల్లి తీసుకునే పోషకాలు భవిష్యత్తులో వారి మేధస్సు, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

ప్రెగ్నెన్సీ(Pregnancy Nutrition) సమయంలో శార్డైన్స్ వంటి కొవ్వు చేపలు, గుమ్మడి గింజలు, ఆకుకూరలైన పాలకూర, బీట్‌రూట్, దానిమ్మ వంటి పండ్లు, చికెన్, చిక్కుళ్లు, బ్రెజిల్ నట్స్, పల్లీలు, అవకాడో, గ్రీక్ యోగర్ట్ లాంటి ఆహారాలు ఎంతో ఉపయోగకరమని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో ఉండే మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాల పెరుగుదలకు సహాయపడతాయి. అలాగే సెలీనియం, అయోడిన్ వంటి ఖనిజాలు నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడతాయని తెలిపారు.
సమతుల్యమైన ఆహారం, తగినంత నీరు, సరైన నిద్ర, ఒత్తిడిని తగ్గించే అలవాట్లు పాటిస్తే గర్భిణీలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్ కూడా మెరుగ్గా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: