గర్భధారణ(Pregnancy Care) సమయంలో రక్తహీనత లేదా రక్తపోటు సమస్యలు ఉన్న మహిళల్లో కాళ్ల వాపు సాధారణంగా కనిపిస్తుంది. అలాగే గర్భసంచి పెరగడం, శిశువు బరువు అధికంగా ఉండటం వల్ల కాళ్లపై ఒత్తిడి పెరిగి వాపు రావచ్చు. ఇది చాలాసార్లు సహజ ప్రక్రియలో భాగంగానే జరుగుతుంది.

అయితే వాపు క్రమంగా కాకుండా ఒక్కరోజులోనే అకస్మాత్తుగా ఎక్కువగా రావడం, కాళ్లను నొక్కినప్పుడు లోతు ఏర్పడి అది మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటే అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా(Pregnancy Care) రెండు కాళ్లు కాకుండా ఒక్క కాలే ఎక్కువగా వాచినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఇలాంటి లక్షణాలు కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: