పల్లీలు మరియు నువ్వులు ఈ రెండు మన ఆహారాలలో ఎంతో ప్రాధాన్యం గలవి. ఇవి స్వల్ప ధరలో లభించే, శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలను అందించే పదార్థాలుగా గుర్తింపు పొందాయి. రోజువారీ ఆహారంలో ఇవి భాగంగా ఉంటే శక్తి, సహనశక్తి, రోగనిరోధక శక్తి, మెదడు ఆరోగ్యం, చర్మం మెరుపు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇప్పుడు ఈ రెండు పదార్థాల పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు, వాడక విధానం, జాగ్రత్తలు గురించి విపులంగా తెలుసుకుందాం.

పల్లీలు– పోషక నిధి:
పల్లీలు ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్, ఫైబర్, విటమిన్ E, నయాసిన్ (Vitamin B3), ఫోలేట్, మాంగనీస్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్, మరియు ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాల సమాహారంగా నిలుస్తాయి. ఇవి శక్తిని వెంటనే అందించడంలో సహాయపడతాయి.
నువ్వులు – శక్తివంతమైన విత్తనాలు:
నువ్వుల్లో లిగ్నాన్స్, సెసమిన్, సెసమోల్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి. అలాగే ఇందులో విటమిన్ B1, B6, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.
పల్లీలు ,నువ్వులు కలిపి తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
ఈ రెండు పదార్థాల్లోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉండడం వల్ల శరీర కండరాల అభివృద్ధి, మరియు శక్తి అవసరాలకు తోడ్పడతాయి. శాకాహారులకు ఇవి ప్రోటీన్‌కు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి.
గుండె ఆరోగ్యానికి మేలు: హెల్తీ ఫ్యాట్స్ (ఒమేగా-6, ఒమేగా-9) ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి. ఇది గుండెకు రక్షణగా నిలుస్తుంది.
జీర్ణవ్యవస్థ మెరుగుదల: పల్లీలు, నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గ్యాస్, అసిడిటీ, వంటి సమస్యలు తగ్గుతాయి. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి.
చర్మ ఆరోగ్యానికి రక్షణ: విటమిన్ E, జింక్, మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. చర్మానికి మెరుపు చేకూరుతుంది.
మెదడు పనితీరు: విటమిన్ B3 (నయాసిన్), మెగ్నీషియం మెదడు శక్తిని మెరుగుపరుస్తాయి. గమనికా శక్తి, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వృద్ధాప్యంలో మానసిక స్థైర్యానికి ఇవి తోడ్పడతాయి.
రోగనిరోధక శక్తి పెంపు: పల్లీలు, నువ్వుల్లో ఉండే ఐరన్, జింక్, సెలీనియం, విటమిన్ B6, ఫోలేట్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.

ఎముకల బలం: నువ్వుల్లో అధికంగా ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మరియు బోరాన్ ఎముకల బలాన్ని పెంచుతాయి. కీళ్ల నొప్పులు, అస్థిమ్జనక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. నువ్వులలో ఉండే లిగ్నాన్స్, సెసమిన్ వంటి పదార్థాలు మహిళలలో హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడుతాయి. పిసి ఓ ఎస్ (PCOS), మెనోపాజ్ వంటి పరిస్థితుల్లో ఉపశమనం కలిగించగలవు.
బరువు నియంత్రణ: పల్లీలు, నువ్వులు తక్కువ పరిమాణంలో తినడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల సంతృప్తి కలుగుతుంది, మళ్లీ మళ్లీ తినే అలవాటు తగ్గుతుంది. ఫిట్‌నెస్ మెయింటైన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి.
బీపీ నియంత్రణ: ఇవి లో సోడియం తక్కువగా ఉండి పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. ప్రత్యేకించి నువ్వుల్లో ఉండే మాగ్నీషియం, హైపర్‌టెన్షన్‌కి ఉపశమనం కలిగిస్తుంది. పల్లీలు, నువ్వులు, బెల్లం కలిపి లడ్డూలు తయారు చేసి తినడం ద్వారా శక్తి, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన నువ్వులు, పల్లీలు తినడం చాలా మంచిది.
Read also: Water: శరీరంలో నీటి శాతం తక్కువైతే ఏమైతుంది