మన శరీర ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో గోర్లు (Nails) కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాక, శరీరంలోని అంతర్గత ఆరోగ్య పరిస్థితులను సూచించే సహజ సూచకాలు. గోర్ల (Nails)రంగు, ఆకారం, మెరుపు, బలహీనత వంటి వాటిని గమనించడం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. మన శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పుల్లో గోర్ల (Nails)రంగు, ఆకారంలో (Color, shape)వచ్చే మార్పులు కూడా చాలా ముఖ్యం. వీటిని మనం పెద్దగా పట్టించుకోం.. కానీ ఇవి కొన్ని కీలకమైన ఆరోగ్య సమస్యలకు సిగ్నల్స్ కావచ్చు.

మన గోర్లు మన ఆరోగ్యం గురించి చాలా విషయాలే చెబుతాయి. గోరుపై పసుపు చారలు ఉంటే సిగరెట్ తాగేవారికి ఇలా జరగొచ్చు. కానీ కొన్నిసార్లు ఇది లివర్ సంబంధిత జబ్బులకు కూడా సూచన కావచ్చు.
పొడవైన గీతలు లేదా లైన్స్ఉం టేఇవి ఆర్థరైటిస్, పొట్ట సమస్యలు లేదా లివర్ పనితీరులో మార్పులు ఉన్నాయని చెప్పే సంకేతాలు. తెల్లటి చారలు లేదా మచ్చలు ఉంటే ఇది శరీరంలో ప్రోటీన్ లోపం, జింక్ తక్కువగా ఉండటం లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని సూచించవచ్చు. గోర్లు పూర్తిగా తెల్లగా మారితే.. ఇది లివర్ ఫెయిల్యూర్ లేదా శరీరంలోని ఇతర అవయవాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు. గోర్లు పసుపు రంగులోకి మారితే ఇది జాండీస్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. గోర్ల రంగు మారినంత మాత్రాన ఏదో పెద్ద జబ్బు ఉందని కంగారు పడొద్దు. కానీ సడెన్‌గా గోర్ల రంగు మారినా లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మార్పులు కనిపించినా.. తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
గోళ్ల యొక్క ఐదు విధులు ఏమిటి?
వేళ్ల గోళ్లు మరియు కాలి గోళ్లు రెండూ వేళ్లు మరియు కాలి వేళ్ల యొక్క మృదు కణజాలాలను గాయం నుండి రక్షిస్తాయి. గోళ్లు వేళ్ల గుజ్జుపై చూపే ప్రతి-పీడనం ద్వారా వేళ్ల సున్నితత్వాన్ని మరియు చేతివేళ్ల యొక్క ఖచ్చితమైన కదలికలను పెంచడానికి కూడా వేలుగోళ్లు ఉపయోగపడతాయి.
గోర్లు శరీరాన్ని ఎలా రక్షిస్తాయి?
గోర్లు వేళ్లు మరియు కాలి వేళ్ల యొక్క సున్నితమైన చిట్కాలను రక్షిస్తాయి. మన మనుగడకు గోర్లు అవసరం లేదు, కానీ అవి మన వేళ్లు మరియు కాలి వేళ్ల చిట్కాలకు మద్దతు ఇస్తాయి, గాయం నుండి వాటిని రక్షిస్తాయి మరియు చిన్న వస్తువులను తీయడంలో మనకు సహాయపడతాయి. అవి లేకుండా, దురదను గీసుకోవడం లేదా ముడిని విప్పడం మనకు కష్టంగా ఉంటుంది.
గోర్లు ఎక్కడి నుండి పెరుగుతాయి?
నెయిల్ మ్యాట్రిక్స్ నుండి గోర్లు పెరుగుతాయి, ఇది గోరు యొక్క బేస్ వద్ద క్యూటికల్ కింద ఉన్న ఒక ప్రత్యేక ప్రాంతం. ఈ మ్యాట్రిక్స్ కొత్త గోరు కణాలను విభజించి ఉత్పత్తి చేసే కణాలను కలిగి ఉంటుంది, అవి పరిపక్వం చెందుతున్నప్పుడు ముందుకు నెట్టబడి, కనిపించే గోరు ప్లేట్‌ను ఏర్పరుస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: