కాలంతో సంబంధం లేకుండా దోమలు ఎల్లప్పుడూ విజృంభిస్తూనే ఉంటాయి. నిత్యం ఏదో ఒక సందర్భంలో దోమకాటుకు గురవుతూనే ఉంటాం. దోమకాటు కారణంగా డెంగ్యూ, మలేరియా,చికెన్ గున్యా వంటి విష జర్వాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ దోమలు కొన్నిసార్లు కొందరినే ఎక్కువగా కడుతూ ఉంటాయి. ఎక్కువగా వారి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇలా దోమలు(Mosquitoes)ఎక్కువగా కొందరి చుట్టూనే ఎక్కువగా తిరగడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా.. ఇలా చుట్టూ తిరగడం వల్ల చికాకుతో పాటు దోమకాటుకు కూడా ఎక్కువగా గురవ్వాల్సి వస్తుంది. కారణాలేవైనప్పటికీ మన జీవనశైలిలో, ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకోవడం వల్ల దోమలకు (Mosquitoes)అయస్కాంతంగా మారకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం మన చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా దోమలు మనకు ఎక్కువ లేదా తక్కువ ఆకర్షితమవుతూ ఉంటాయి. చక్కెర, ఆల్కహాల్ వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీర వాసన మారుతుంది. ఈ వాసన దోమలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. కొన్ని ఆహారాలు మన శరీర ఉష్ణోగ్రత, జీవక్రియను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలు కూడా దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. మన శరీర దుర్వాసన కూడా దోమలకు ఆకర్షణీయంగా మారుతుంది. లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియా వంటి సమ్మేళనాలను శరీరం ఉత్పత్తి చేస్తుంది. ఈ సమ్మేళనాల కారణంగా దోమలు ఎక్కువగా ఆకర్షించబడతాయి. కొందరు ఈ సమ్మేళనాలను తక్కువగా ఉత్పత్తి చేస్తారు. అలాంటి వారు దోమలను తక్కువగా ఆకర్షిస్తారు.
Read Also : http://Health Tips: బీపీకి కొత్త విప్లవాత్మక చికిత్స: ఆరు నెలలకు ఒక ఇంజెక్షన్ చాలు!

అలాగే శరీరంలో అధికజీవక్రియ రేటు కలిగిన వారు కార్బన్ డై యాక్సైడ్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. ఇలాంటి వారు కూడా దోమలను ఎక్కువగా ఆకర్షిస్తారు. శరీరంలో రోగనిరోధక శక్తి సరిగ్గా పనిచేయనప్పుడు శరీరం కొన్ని సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ సమ్మేళనాలు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అలాగే పేగుల ఆరోగ్యం కూడా దోమలను ఆకర్షిస్తుంది. పేగుల ఆరోగ్యం చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పేగుల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల చర్మం కొన్ని సమ్మేళనాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ సమ్మేళనాల కారణంగా దోమలు ఎక్కువగా ఆకర్షించబడతాయి. ఇలా వివిధ కారణాల వల్ల దోమలు కొందరి చుట్టూనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక దోమలను తక్కువగా ఆకర్షించాలనుకునే వారు పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఫైబర్, ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే చక్కెర, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. ఈ పదార్థాలను తగ్గించడం వల్ల శరీరం నుండి వచ్చే వాసన మారి దోమలు ఎక్కువగా మన దగ్గరికి రాకుండా ఉంటాయి. అదే విధంగా శరీరం నుండి దుర్వాసన రాకుండా చూసుకోవాలి. రోజూ స్నానం చేయాలి. చెమట ఎక్కువగా పట్టకుండా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ఇలా చేయడం వల్ల దోమ కాటుకు ఎక్కువగా గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: