వంటింట్లో చిన్న చిన్న సమస్యలను(KitchenTips) సులభంగా పరిష్కరించడానికి కొన్ని సరళమైన చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిరోజూ వాడే పదార్థాలతోనే ఇవి చేయవచ్చు.

- పనీర్‌ను తాజాగా ఉంచాలంటే
పనీర్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంచాలనుకుంటే బ్లాటింగ్ పేపర్‌తో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది తేమను నియంత్రించి పనీర్‌ను తాజాగా ఉంచుతుంది. - స్వీట్స్‌లో తీపి ఎక్కువైతే
ఇంట్లో చేసిన వంటకాలలో లేదా స్వీట్స్‌లో(KitchenTips) చక్కెర ఎక్కువైందనిపిస్తే, కొద్దిగా నిమ్మరసం కలిపితే తీపి తగ్గుతుంది. అవసరమైతే స్వల్ప పరిమాణంలో వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. - చేతికి కాలినప్పుడు ఉపశమనం
వంట చేస్తూ చేతులు స్వల్పంగా కాలితే, బంగాళాదుంప ముక్కతో రుద్దితే మంట తగ్గి ఉపశమనం లభిస్తుంది. - కరివేపాకు పొడికి రుచి పెంచాలంటే
కరివేపాకు పొడి తయారు చేసే సమయంలో వేయించిన నువ్వుల పొడి కలిపితే రుచి, వాసన మరింత మెరుగుపడుతుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: