కేరళలో (KERALA) ఆసుపత్రికి చేరకముందే ప్రాణాంతక పరిస్థితిలో రోడ్డు పక్కనే సర్జరీ చేసిన వైద్యుల ఘట్టం నెటిజన్లకు నిదర్శనం అయింది. ఎర్నాకుళం పరిధిలో, పేరూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉండగా, అతడిని కాపాడటానికి డాక్టర్ థామస్ పీటర్, ఆయన భార్య డాక్టర్ దిడియా థామస్, మరియు కోటయం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. మనూప్ రోడ్డు పక్కన అత్యవసర చికిత్స నిర్వహించారు.
Read also: HomeTips: ఇంటి పనులకు సులువైన చిట్కాలు..

Surgery performed on the road
మొబైల్ ఫోన్ల టార్చ్ వెలుతురులో
నాలుగు నిమిషాల్లోనే శస్త్రచికిత్స పూర్తి చేసి, బాధితుడిని మృత్యుఒడి నుంచి బయటకు తీయడం ద్వారా ఆయన ప్రాణాలను కాపాడారు. తర్వాత అతడిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రజల, పోలీసుల సహకారం ఈ సాహసిక చర్యలో కీలక పాత్ర పోషించింది. ఈ ఘటనను ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి, డాక్టర్‌లను అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: