థైరాయిడ్ అనేది చాలా చిన్న గ్రంథి అయినా, శరీరానికి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి సరిగా పని చేయకపోతే శరీరంలోని హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. ఫలితంగా బరువు పెరగడం, అలసట, నీరసం, చలికి తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ సరైన ఆహారం(Healthy Foods) తీసుకుంటే థైరాయిడ్‌ను(Thyroid) కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
Read Also: Finger Millets: రాగుల ఆరోగ్య రహస్యాలు
కొబ్బరి – థైరాయిడ్‌ను సమతుల్యం చేసే సహజ ఆహారం
కొబ్బరిలో ఉన్న హెల్తీ ఫ్యాట్స్ హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి. వర్జిన్ కొబ్బరి నూనె (Virgin Coconut Oil) వాడడం వల్ల మెటబాలిజం మెరుగవుతుంది, అలసట తగ్గుతుంది. వంటల్లో ఈ నూనెను ఉపయోగించడం ద్వారా శరీరంలో(Healthy Foods) ఇన్‌ఫ్లమేషన్ తగ్గి, థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది.
అయోడిన్ ఉన్న ఉప్పు తప్పనిసరి
థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయాలంటే శరీరానికి సరిపడా అయోడిన్ అందాలి. వంటల్లో ఐయోడైజ్డ్ సాల్ట్ (Iodized Salt) వాడటం ద్వారా ఈ అవసరాన్ని తీర్చవచ్చు. పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ వాడే వారు పెరుగు, చేపల వంటి అయోడిన్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇది హైపో లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

మునక్కాయలు మరియు మునగాకులు – జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ మూలాలు
మునక్కాయల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్లను సరిగ్గా ఉత్పత్తి చేయడంలో సహకరిస్తుంది. అదనంగా, మునగాకులు యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండిపోతాయి. ఇవి రక్తహీనత, నీరసం తగ్గించడంలో సహాయపడతాయి. సాంబార్, చట్నీ లేదా పప్పు రూపంలో వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు.

గుమ్మడి గింజలు – చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్యం
గుమ్మడి గింజల్లో జింక్, ఐరన్, సీలీనియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి హార్మోన్ బ్యాలెన్స్‌కి, రోగనిరోధక శక్తి పెంచడంలో కీలకంగా పనిచేస్తాయి. ఈ గింజలను నేరుగా, రోస్ట్ చేసి లేదా సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు. చట్నీగా లేదా రొట్టె పిండిలో కలిపి కూడా వాడవచ్చు.

Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: