కోడిగుడ్లు మన శరీరానికి అత్యంత పోషకాలు కలిగిన ఆహారం. రోజూ ఒక కోడిగుడ్డును (Eggs) తినడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. నిపుణులు సూచిస్తారు గుడ్లను ఉడకబెట్టి తినడం ద్వారా అందులోని ప్రోటీన్, ఐరాన్, మెగ్నీషియం వంటి ముఖ్య పోషకాలపై పూర్తి ప్రయోజనం పొందవచ్చు.
Read also: Uric acid: యూరిక్ యాసిడ్ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం..

When is it best to eat eggs?
ఉదయం తినడం ఎక్కువ లాభకరo
గుడ్లలోని జింక్ రక్తకణాల ఉత్పత్తిని పెంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. పురుషుల శృంగార సామర్థ్యం పెరుగుతుంది, కండరాల నొప్పులు తగ్గి బలం పెరుగుతుంది. ఐరాన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ప్రోటీన్ అధికంగా అందినందున శక్తి, చురుకుదనం పెరుగుతుంది.
అధ్యయనాల ప్రకారం, కోడిగుడ్లను ఉదయం తినడం ఎక్కువ లాభకరమని తేలింది. ముఖ్యంగా ఉదయం వ్యాయామం చేసిన తర్వాత గుడ్డు తినడం శరీరానికి శక్తినిస్తుందని, రోజంతా చురుగ్గా పని చేయగలమని సూచన. రాత్రి గుడ్లు తింటే శరీరంలో కొలెస్ట్రాల్, క్యాలరీలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే కోడిగుడ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: