థైరాయిడ్(Health) సమస్యలతో బాధపడేవారు కేవలం మందులపైనే ఆధారపడకుండా, రోజువారీ ఆహార అలవాట్లలో కూడా సరైన మార్పులు చేసుకోవడం చాలా అవసరం. థైరాయిడ్(Thyroid) గ్రంథి సరిగా పనిచేయాలంటే శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందాలి. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ మనోజ్ విత్లానీ ప్రకారం, అయోడిన్, సెలీనియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్ ఆరోగ్యానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి.
Read also: Seeds: కొలెస్ట్రాల్ తగ్గించే అత్యుత్తమ గింజలు

సరైన ఆహారంతో థైరాయిడ్ సమస్యలకు చెక్
అయోడిన్ లోపం థైరాయిడ్ సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు. అందుకే రోజువారీ ఆహారంలో అయోడైజ్డ్ ఉప్పును తప్పనిసరిగా(Health) వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పాలు, పెరుగు, గుడ్లు, చేపలు వంటి ఆహార పదార్థాలు అయోడిన్‌కు మంచి మూలాలు. సముద్రపు చేపలు, ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి వాటిలో సెలీనియం అధికంగా లభిస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జింక్ కోసం గింజలు, వేరుశనగలు, పప్పు ధాన్యాలు తీసుకోవాలి. బెర్రీలు, టమోటాలు, ఆకుకూరలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం శరీరంలో వాపును తగ్గించి, హార్మోన్ సమతుల్యతను మెరుగుపరుస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న అవకాడో, ఆలివ్ ఆయిల్, విత్తనాలు తీసుకోవడం మంచిది. లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలు పెరిగి, అలసట తగ్గుతుంది. అయితే అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, చక్కెర పదార్థాలను వీలైనంత వరకు తగ్గించాలి. వైద్యుల సలహా మేరకు సరైన ఆహార నియమాలు పాటిస్తే, థైరాయిడ్ సమస్యలను చాలా వరకు నియంత్రించుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: