ఇటీవలి కాలంలో ఆకలి లేకపోవడం, తక్కువ తినినప్పటికీ కడుపు నిండినట్లుగా అనిపించడం అనేది చాలామందిలో కనిపిస్తున్న సమస్యగా మారింది. ఇది కేవలం తాత్కాలిక మానసిక ఒత్తిడి వల్ల కలిగినదే కాదు, దీని వెనుక అసలు కారణం ఒక ముఖ్యమైన పోషక లోపమే కావచ్చు. ముఖ్యంగా విటమిన్ B1 (థయామిన్) లోపం దీనికి ప్రధాన కారణంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శరీర జీవక్రియలో విటమిన్ B1 పాత్ర
విటమిన్ B1 అనేది శరీరంలోని జీవక్రియల నియంత్రణకు కీలకమైన పోషక పదార్థం. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది ప్రధానంగా పనిచేస్తుంది. అయితే శరీరంలో ఈ విటమిన్ స్థాయి తగ్గినప్పుడు జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా, ఆకలి లేకపోవడం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చు.

నాడీ వ్యవస్థపై ప్రభావం
విటమిన్ B1 లోపం కేవలం ఆకలిని మాత్రమే ప్రభావితం చేయదు, ఇది నాడీ వ్యవస్థ పనితీరును కూడా దెబ్బతీయగలదు. దీని వల్ల జీర్ణవ్యవస్థలో మార్పులు(Changes digestive system), మానసిక గందరగోళం, ఏకాగ్రత లోపం, చిరాకు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎక్కువగా వృద్ధులలో ఇది కనిపించినప్పటికీ, ప్రస్తుతం యువతలో కూడా దీనివల్ల కలిగే సమస్యలు పెరుగుతున్నాయి.
విటమిన్ B1 లోపాన్ని ఎలా నివారించాలి?
ఈ పోషక లోపాన్ని నివారించాలంటే, పౌష్టికాహారం (Nutrition)తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలలో విటమిన్ B1 పుష్కలంగా లభిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం:
తృణధాన్యాలు, చిక్కుళ్లు
బియ్యం, గోధుమ, జొన్న వంటి తృణధాన్యాలు విటమిన్ B1 మంచి మూలాలు. ఇవి రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన థయామిన్ అందుతుంది.
ఆకుకూరలు
పాలకూర, ముల్లంగికూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో విటమిన్ B1 పుష్కలంగా ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది.
గింజలు మరియు ఎండిన పండ్లు
వేరుశెనగలు, వాల్‌నట్స్, సన్‌ఫ్లవర్ విత్తనాలు వంటి గింజల్లో కూడా ఈ విటమిన్ అధికంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మాంసాహార పదార్థాలు
చికెన్, చేపలు వంటి మాంసాహారాల్లో విటమిన్ B1 సమృద్ధిగా ఉంటుంది. మాంసాహారం తీసుకునే వారు వీటిని నియమితంగా తినడం వల్ల ఈ లోపాన్ని తగ్గించుకోవచ్చు.
Read hindi news hindi.vaartha.com
Read also