గుమ్మడికాయ ఎంత పోషకవంతమో, దాని గింజలు కూడా అంతకంటే ఎక్కువ ఆరోగ్య(Health) లాభాలను అందిస్తాయి. చిన్నగా కనిపించినా, గుమ్మడి గింజల్లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు దాగి ఉన్నాయి. వీటిలో ఫైబర్, మంచి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ C, విటమిన్ Kతో పాటు ఫాస్ఫరస్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.
Read Also: Healthy Living: ‘బ్లూ జోన్స్’ ప్రాంతాల ఆరోగ్య రహస్యాలు

గుండె నుంచి జీర్ణక్రియ వరకూ గుమ్మడి గింజల మేలు
ఈ పోషకాల వల్ల గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. నిద్రలేమితో బాధపడేవారికి ఇవి సహజ ఔషధంలా పనిచేస్తాయి, ఎందుకంటే వీటిలో ఉండే మాగ్నీషియం(Magnesium) మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.

జీర్ణవ్యవస్థను బలపరచడంలో గుమ్మడి గింజలు(Pumpkin seeds) ఎంతో ఉపయోగపడతాయి. మలబద్ధకం సమస్యను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు, రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. నిపుణుల సూచనల ప్రకారం రోజుకు సుమారు 2 గ్రాముల గుమ్మడి గింజలను ఆహారంలో భాగంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: