Health: శీతాకాలం (winter) వచ్చేసరికి శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో చాలామంది కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే, ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావించే కొన్ని ఫుడ్స్ నిజానికి శరీరానికి హానికరంగా మారవచ్చని పుణేకు చెందిన న్యూట్రిషనిస్ట్ అమిత గాద్రే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉసిరి మిఠాయి, చ్యవన్‌ఫ్రెష్, డ్రై ఫ్రూట్ లడ్డూలు వంటి వాటిలో చక్కెర, కేలరీలు అధికంగా ఉండటంతో బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్ పెరిగే ప్రమాదం ఉందని ఆమె చెబుతున్నారు. తాజా ఉసిరిని నేరుగా లేదా చట్నీ, కూరల రూపంలో తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
Read also: SkinCare: చర్మ సంరక్షణకు ఆముదం.. సహజ సౌందర్య రహస్యం

శీతాకాలంలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం
అలాగే చలికాలంలో ఎక్కువగా తీసుకునే నెయ్యి, ప్యాక్ చేసిన సూపులు కూడా పరిమితంగా మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. శీతాకాలంలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం వల్ల అధిక కొవ్వు పదార్థాలు శరీరానికి అవసరం ఉండదని అమిత గాద్రే అభిప్రాయపడుతున్నారు. ప్యాక్ చేసిన సూపుల్లో అధిక సోడియం, ప్రిజర్వేటివ్స్ ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేయవని ఆమె చెబుతున్నారు. వీటికి బదులు ఇంట్లోనే తాజా కూరగాయలతో చేసిన సూపులు, సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవడం చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: