వంటకాల్లోనూ నువ్వుల పాత్ర ప్రత్యేకమైనదే. నిండుగా నువ్వులు అద్దిన అరిసెల ప్రత్యేకత వేరు. జంతికల్లో కాసిన్ని చేర్చితే ఆ రుచి అమోఘం. నువ్వుండల గురించి ఇక చెప్పేదేముంది? నువ్వులు రుచిని మాత్రమే కాదు అపారమైన పోషకాలనీ అందిస్తాయి. రోజూ కాసిని నువ్వులని ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్‌తోపాటు, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటుంది. శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే రోగాలు దాడి చేస్తాయి. అందుకే శీతాకాలంలో నువ్వులు(Sesame seeds)తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వేడి స్వభావం కలిగిన నువ్వులు (Sesame seeds)శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతాయి.వంటకాల్లోనూ నువ్వుల పాత్ర ప్రత్యేకమైనదే. నిండుగా నువ్వులు అద్దిన అరిసెల ప్రత్యేకత వేరు. జంతికల్లో కాసిన్ని చేర్చితే ఆ రుచి అమోఘం. నువ్వుండల గురించి ఇక చెప్పేదేముంది? నువ్వులు రుచిని మాత్రమే కాదు అపారమైన పోషకాలనీ అందిస్తాయి.
Read Also: AP: ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

రోజూ కాసిని నువ్వులని ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్‌తోపాటు, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటాయట. ఫలితంగా గుండెజబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది. నువ్వుల్లో మేలు చేసే కొవ్వులు ఉండటమే ఇందుకు కారణం అంటున్నాయి అధ్యయనాలు. మామూలు నువ్వులతో పోలిస్తే వేయించినవి తింటే మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయట. ముఖ్యంగా కండరాల బలానికీ, హార్మోన్లు చురుగ్గా ఉండటానికీ ఇవి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలంలో నువ్వులను మన ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతిరోజూ నువ్వుల లడ్డులు లేదా సాధారణ నువ్వుల చట్నీ కూడా తినవచ్చు. నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి కూడా మేలు చేస్తాయి. శీతాకాలంలో నువ్వుల పొడిని తయారు చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: