మనిషి శరీరం(Health Awareness) అనేక రకాల నొప్పులను భరిస్తుంటుంది. కానీ కొన్ని నొప్పులు మాత్రం తట్టుకోలేనివిగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రసవ సమయంలో వచ్చే నొప్పి మహిళల జీవితంలో అత్యంత తీవ్రమైన అనుభవంగా భావిస్తారు. అలాగే గౌట్ వ్యాధి వల్ల కీళ్లలో వచ్చే వేదన, ఎముకలు విరిగినప్పుడు కలిగే అసహనకరమైన బాధ, కిడ్నీ రాళ్ల కారణంగా వచ్చే నొప్పి కూడా అత్యంత తీవ్రంగా ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.

మనసును కలిచివేసే తీవ్రమైన వేదనలపై వైద్యుల హెచ్చరిక
ఇవే కాకుండా నరాల వ్యవస్థకు(Health Awareness) సంబంధించిన కొన్ని వ్యాధులు కూడా భయంకరమైన నొప్పిని కలిగిస్తాయి. క్లస్టర్ హెడ్‌ఏక్స్‌ను ‘సూసైడ్ హెడ్‌ఏక్స్’ అని కూడా అంటారు. ట్రైజెమినల్ న్యూరల్జియా ముఖ నరాలను తీవ్రంగా వేధిస్తుంది. CRPS వంటి వ్యాధుల్లో చిన్న స్పర్శ కూడా తీవ్రమైన వేదనగా అనిపిస్తుంది.
అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, షింగిల్స్, ఫైబ్రోమైయాల్జియా వంటి సమస్యలు శరీరాన్ని పూర్తిగా అలసిపోయేలా చేస్తాయి. ఈ నొప్పులు కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: