ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఎన్నో పోషకాహార పదార్థాల్లో గోజీ బెర్రీలు (Goji Berries) ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. చైనాలో వందల ఏళ్లుగా ఆయుర్వేదం లో భాగంగా వాడుతున్న ఈ చిన్న పండ్లు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా “సూపర్‌ఫుడ్స్”గా గుర్తింపు పొందాయి. వీటిని మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

కంటి ఆరోగ్యానికి
ఈ కాలంలో చిన్న వయసులోనే కంటి చూపులో సమస్యలు ఎక్కువయ్యాయి. కంప్యూటర్, మొబైల్ స్క్రీన్‌ల వల్ల దృష్టిలో వత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గోజీ బెర్రీలు (Goji berries) కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే జియాక్సంతిన్ (Zeaxanthin), ల్యూటిన్ (Lutein) వంటి యాంటీ ఆక్సిడెంట్లు కళ్లను నీలి కాంతి ప్రభావం నుండి రక్షిస్తాయి. రోజుకి పది ఎండు గోజీ బెర్రీలు తీసుకోవడం వల్ల చూపులో మెరుగుదల వస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
శరీరానికి శక్తిని అందించే శక్తివంతమైన ఫలాలు
గోజీ బెర్రీలు తిన్న వెంటనే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి అరటిపండు తిన్నట్టు ఎనర్జీ అందిస్తాయి. చైనా (China) లో ప్రజలు ఇవి సూప్‌లలో, టీ రూపంలో కూడా ఉపయోగిస్తారు. ఇవి ఎండిన రూపంలో దొరుకుతాయి కాబట్టి నిల్వ చేసుకోవడంలో సులభతరం. వీటిని ‘డ్రైడ్ గోజీ బెర్రీలు’ (Dried Goji Berries)గా ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయొచ్చు.
గుండె, క్యాన్సర్, మరియు ఇతర వ్యాధుల నుంచి రక్షణ
గోజీ బెర్రీలు కేవలం కంటి ఆరోగ్యానికే కాదు, ఇతర శరీర అవయవాల రక్షణకూ ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోలీఫెనాల్స్, శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. ఇవి గుండె సంబంధిత రోగాలను తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి కూడా వీటికి ఉంది.

గోజీ బెర్రీలు ప్రధానంగా టిబెట్, హిమాలయ ప్రాంతాలు, చైనా వంటి దేశాలలో విస్తృతంగా పండుతాయి. వీటిని “హిమాలయన్ గోజీ”, “టిబెటన్ గోజీ” అని కూడా పిలుస్తారు. లైసియం చినెన్స్ (Lycium chinense), లైసియం బార్బరమ్ (Lycium barbarum) అనే రెండు రకాల మొక్కలపై ఈ పండ్లు పెరుగుతాయి.
ధర మరియు అందుబాటు
ఇవి సాధారణ డ్రై ఫ్రూట్స్ కంటే కొంచెం ఖరీదైనవే. మంచి క్వాలిటీ గోజీ బెర్రీల ధర కేజీకి ₹1200–₹1500 వరకు ఉండొచ్చు. అయినా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని తరచుగా తీసుకోవడం వలన పొందే ప్రయోజనాలు ఎంతో విలువైనవే.
వయస్సుతో సంబంధం లేకుండా కంటి చూపు, గుండె ఆరోగ్యం, క్యాన్సర్ నివారణ వంటి అంశాలలో గోజీ బెర్రీలు సహాయపడతాయి. ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని చేపట్టాలనుకునేవారు వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఈ చిన్న పండ్లను మీ డైట్‌లో ఒక భాగం చేసుకోండి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Health: ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడితే వచ్చే సమస్యలు ఇవే?