హైదరాబాద్ : అత్యంత ఖరీదైన కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో (Gandhi hosputal) ప్రారంభం అయ్యాయి. ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో గతవారం సర్జరీని విజయవంతంగా జరిపారు. వినికిడి లోపంతో పుట్టిన చిన్నారులకు కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీతో లోపాలను సరిచేస్తున్నారు. ఐదేళ్ల వయసు లోపు చిన్నారులకు ఈ సర్జరీల వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ సర్జరీ చేయడానికి దాదాపు రూ. 10లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐదేళ్లతోపు చిన్నారులు దాదాపు 40 మంది ఉన్నట్లు గుర్తించారు.
Read also: Hyd Crime: తల్లిదండ్రులు మందలించారని పదోతరగతి బాలిక ఆత్మహత్య

Free conch implant surgeries at Gandhi Hospital
ఈ సంవత్సరం చివరి వరకు సర్జరీలు
వీరందరికి ఈ సంవత్సరం చివరి వరకు సర్జరీలు పూర్తి చేయనున్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి తెలిపారు. కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించనున్నట్లు వివరించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్య సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మార్గదర్శకత్వంలో గాంధీ ఆస్పత్రిలో ఖరీదైన సర్జరీలను ఉచితంగా అందించడానికి విశేషకృషి జరుపుతున్నట్లు ఆమె వివరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: