ఉత్తర భారతదేశంలోని కొండ ప్రాంతాలు అనేక అరుదైన, పోషక విలువలతో నిండిన కూరగాయలకు ప్రసిద్ధి. అలాంటి ప్రత్యేకమైన పర్వత కూరగాయల్లో లింగుడ (ఫిడిల్‌హెడ్ ఫెర్న్) ఒకటి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్‌లు సమృద్ధిగా ఉండటంతో పాటు కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు దీనిని ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కూరగాయలలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.
Read Also: Water Chestnut: ఈ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

లింగుడలోని(Fiddlehead Fern) పోషకాలు శరీరానికి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఉత్తర, ఈశాన్య భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లో ఇది విస్తృతంగా లభిస్తుంది. ప్రాంతాన్ని బట్టి దీనిని లింగుడ, లుంగుడ, కాస్రోడ్, చెకో, ముయిఖోన్‌చోక్ వంటి పేర్లతో పిలుస్తారు. కొన్ని చోట్ల కూరగాయగా, మరికొన్ని ప్రాంతాల్లో ఊరగాయగా వాడతారు.
ఈ కూరగాయలో పొటాషియం అధికంగా, సోడియం తక్కువగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. అలాగే తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కారణంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఫిడిల్‌హెడ్ (Fiddlehead Fern)ఫెర్న్‌లో విటమిన్ ఏ పుష్కలంగా ఉండటంతో కంటి చూపును మెరుగుపరుస్తుంది. దృష్టి లోపాలను నివారించడంలో, రక్తహీనత సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. బలహీనమైన ఇమ్యూనిటీ ఉన్నవారికి ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది. లింగుడలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా ఇది సహాయకారిగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: