మునగాకులో ఎన్నో సూక్ష్మ పోషకాలు దాగి ఉంటాయి. మునగకాయలు, ఆకులు తీసుకోవడం వల్ల మీరు ఊహించని లాభాలు ఉన్నాయి. మునగ ఆరోగ్యానికే కాదు. అందానికి కూడా మేలు చేస్తుంది. మునగ ఆకులు, కొమ్మలు, పూలు, కాయలు ఇలా మునగలోని ప్రతి భాగం ఆరోగ్యానికి వరంలాంటిదే (A boon to health)అంటున్నారు నిపుణులు. ఇందులో పాలలో కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. క్యారెట్స్ కంటే ఎక్కువగా విటమిన్ ఎ ఉంటుంది. పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఎన్నో రకాల ఆకుకూర రసాలను ఉదయం ఖాళీ కడుపుతో తాగుతున్నారు. నిజానికి ఉదయం ఖాళీ కడుపుతో ఆకుకూర రసాలు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మునగాకుతో తయారు చేసిన రసాన్ని(drumstick leaves juice ) రోజు ఉదయం తాగడం వల్ల శరీరానికి వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదంతో పాటు పలు తాజా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

ముఖ్యంగా మునగాకులు విటమిన్ ఏతో పాటు సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ విటమిన్స్ లోపంతో బాధపడుతున్న వారు తప్పకుండా తాగండి. రోజు ఉదయాన్నే మునగాకు రసం ( drumstick leaves juice ) తాగడం వల్ల విటమిన్ ఏతో పాటు ఈ వంటి పోషకార పుష్కలంగా అందుతాయి. అంతేకాకుండా ఎముకల సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మునగాకు రసం తాగితే శరీరానికి క్యాల్షియం, ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా అందుతాయి. మునగాకు రసంలో( drumstick leaves juice ) క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను శక్తివంతంగా తయారు చేసేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు రోజు ఉదయాన్నే ఈ ఆకు రసం తాగితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.
మునగ ఆకుల రసం తాగితే మంచిది?
మునగ ఆకులు మీ ఆరోగ్యానికి వివిధ విధాలుగా మేలు చేసే ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఈ ఆకులు మీ ఆహారంలో చేర్చడానికి విలువైనవి ఎందుకంటే అవి మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి మరియు మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇస్తాయి
మునగకాయ యూరిక్ యాసిడ్ను పెంచుతుందా?
మునగకాయ (మోరింగా ఒలిఫెరా) యూరిక్ యాసిడ్ స్థాయిలను గణనీయంగా పెంచుతుందని తెలియదు . వాస్తవానికి, దాని శోథ నిరోధక లక్షణాలు మరియు మూత్రపిండాల ఆరోగ్యానికి తోడ్పడే సామర్థ్యం కారణంగా యూరిక్ యాసిడ్‌ను నిర్వహించడానికి ఇది తరచుగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
మునగకాయ ఆర్థరైటిస్కు మంచిదా?
శోథ నిరోధక లక్షణాల కారణంగా ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు శ్వాసకోశ రుగ్మతల పురోగతిని నిరోధిస్తుంది. మునగ చెట్టు ఆకులు, బెరడు మరియు చెట్టు యొక్క ఇతర భాగాలు క్యాన్సర్ కణాల పురోగతిని నిరోధించడంలో సహాయపడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: