Diwali: హైదరాబాద్ నగరంలో దీపావళి (Diwali) వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నప్పటికీ, అజాగ్రత్త వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాణసంచా కాల్చే సమయంలో కంటి గాయాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మెహదీపట్నoలోని (Mehdipatnam) సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో రాత్రి నుంచి రద్దీ పెరిగింది. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 10 మంది కంటి గాయాలతో ఆసుపత్రికి చేరుకున్నారు. వారిలో 7 మంది చిన్నారులు ఉన్నారని ఆయన చెప్పారు. టపాసులు చేతిలో పేలడం, చినిగిన ముక్కలు కళ్లలో పడటం వంటి ఘటనలు నమోదయ్యాయి.
Read aslo: Metro: హైదరాబాద్ మెట్రోలో షాక్: ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్

Diwali: దీపావళి ఎఫెక్ట్… సరోజిని కంటి ఆసుపత్రికి పెరిగిన రద్దీ
గాయపడిన వారికి తగిన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. “మరిన్ని కేసులు వచ్చినా చికిత్సకు తగిన ఏర్పాట్లు చేసాం,” అని డాక్టర్ ఇబ్రహీం చెప్పారు. అలాగే, పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి గాయాలతో బాధితులు చేరుతున్నారని సమాచారం. ప్రతి సంవత్సరం దీపావళి (Diwali) సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, వైద్యులు ప్రజలను జాగ్రత్తగా బాణసంచా కాల్చాలని, ముఖ్యంగా పిల్లల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి ఎంతమంది గాయపడిన వారు చేరారు?
ఇప్పటివరకు మొత్తం 10 మంది చేరారు, అందులో 7 మంది చిన్నారులు ఉన్నారు.
గాయాలు ఎలా జరిగాయి?
టపాసులు చేతిలో పేలడం, కళ్లలో ముక్కలు పడడం వల్ల గాయాలు అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: