సాధారణంగా కాలేయం దెబ్బతినడానికి మద్యం ప్రధాన కారణమని చాలామంది భావిస్తారు. కానీ వైద్య నిపుణుల మాటల్లో రోజువారీ వంటల్లో ఉపయోగించే కొన్ని రకాల నూనెలు కూడా లివర్ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా సోయాబీన్, సన్‌ఫ్లవర్, మొక్కజొన్న, కనోలా వంటి సీడ్ ఆయిల్స్(Cooking Oils) మితిమీరిన వినియోగం మద్యం కంటే కూడా ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఈ నూనెలను(Cooking Oils) తయారు చేసే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, హెక్సేన్ వంటి రసాయనాలు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ వల్ల నూనెల్లో హానికరమైన పదార్థాలు ఏర్పడి, అవి శరీరంలోకి వెళ్లి కొవ్వు కణాల్లో నిల్వ అవుతాయి. దీని ప్రభావంతో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్, మెటబాలిక్ సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సీడ్ ఆయిల్స్ వినియోగాన్ని తగ్గించి, సహజంగా తయారయ్యే వెన్న, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలను పరిమితంగా వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం, శారీరక వ్యాయామం కూడా లివర్ ఆరోగ్యానికి ఎంతో అవసరమని చెబుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: