కొబ్బరి నీరు త్రాగడాన్ని ఆరోగ్యానికి మేలు చేసే స్వచ్ఛమైన సహజ పానీయంగా భావిస్తారు. ఇందులో సహజంగా ఉండే ఎలక్ట్రోలైట్లు, తక్కువ క్యాలరీలు, మరియు పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి చక్కని హైడ్రేషన్ (Hydration) ను అందిస్తాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారికి ఇది పూర్తిగా సరిపోదు. కొన్నిసార్లు సమస్యలు మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది.
షుగర్ ఉన్నవారికి ఇది మంచిదేనా?
కొబ్బరి నీటి (Coconut Water) లో సహజంగా కొంత చక్కెర ఉంటుంది. 200 మిల్లీలీటర్ల కొబ్బరి నీటిలో సుమారు 6 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది సాధారణంగా తక్కువ గానే ఉన్నా, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది సమస్యగా మారే అవకాశం ఉంది. కొబ్బరి నీరు తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశముండే అవకాశం ఉంది.

అలెర్జీలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి
కొబ్బరి పానీయాలపై అలెర్జీలు చాలా అరుదే అయినా, కొందరికి తీవ్రమైన ప్రతిక్రియలు కలగవచ్చు. వీటిలో చర్మం ఎరుపు కావడం, వాపు, శ్వాసకోశ సమస్యలు (Respiratory Problems) వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొంతమందిలో అనాఫిలాక్సిస్ అనే అత్యవసర స్థితి కూడా ఏర్పడే ప్రమాదం ఉంది.
కిడ్నీ సమస్యలు ఉన్నవారికి అనుకూలం కాదు
కొబ్బరి నీటి (Coconut Water) లో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది గుండె మరియు కండరాల పనితీరుకు మేలు చేస్తుంది. అయితే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారు పొటాషియాన్ని శరీరం నుంచి సరిగా బయటకు పంపలేరు. దీని వల్ల రక్తంలో పొటాషియం స్థాయి పెరిగి హైపర్‌కలేమియా అనే ప్రమాదకర పరిస్థితి తలెత్తవచ్చు.
జలుబు లేదా దగ్గుతో ఉన్నపుడు తీసుకోవచ్చా?
ఆయుర్వేదం ప్రకారం కొబ్బరి నీరు శరీరాన్ని చల్లబరచే లక్షణం కలిగిఉంటుంది. వేసవికాలంలో ఇది ఉపయోగకరంగా ఉన్నా, శీతాకాలంలో లేదా శరీరం చల్లగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత పెరిగే అవకాశముంది. జలుబు లేదా ఫ్లూ వంటి పరిస్థితులలో కొబ్బరి నీరు తినడం తక్షణ ప్రయోజనం ఇవ్వకపోవచ్చు.

హై బీపీ మందులు వాడే వారు జాగ్రత్త!
కొబ్బరి నీరు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నా, ఇప్పటికే హైపర్‌టెన్షన్ మందులు తీసుకుంటున్నవారికి ఇది రిస్క్ కావచ్చు. కొన్ని మందులు పొటాషియాన్ని పెంచుతాయి, దాంతో కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల పొటాషియం స్థాయిలు అధికమై, గుండెకు ముప్పు ఏర్పడుతుంది.
ఎలక్ట్రోలైట్ నియంత్రిత ఆహారం తీసుకునే వారు
గుండె వ్యాధులు, తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నవారు సాధారణంగా పొటాషియం, సోడియం లాంటివి పరిమితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. కానీ కొబ్బరి నీటిలో ఈ ఖనిజాలు సమృద్ధిగా ఉండే కారణంగా, అది వారి ఆహార నియమాలకు భంగం కలిగించవచ్చు.
కొబ్బరి నీరు ఎంతో మంది కోసం సహజమైన పానీయం అయినా, కొంతమందికి ఇది ఆరోగ్యాన్ని ముప్పుపెట్టే అవకాశం కలిగిస్తుంది. ముఖ్యంగా కొన్ని జబ్బులు ఉన్న వారు ఈ పానీయాన్ని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం. ఆరోగ్యపరమైన ఎలాంటి మార్పులు చేసుకునే ముందు వ్యక్తిగత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Read also: