లవంగాలు(Cloves) వంటకాలకు రుచి పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఔషధంగా ప్రసిద్ధి. ఆయుర్వేదం ప్రకారం, రాత్రి నిద్రకు ముందు ఒక లవంగం నమలడం లేదా లవంగాల నీరు తాగడం వల్ల శరీరంలో పలు సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ బలోపేతం కావడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
Read also: Banana: గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?

లవంగాల్లో ఉన్న సహజ గుణాలు అజీర్ణం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సాధారణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు, రోగనిరోధక శక్తిని పెంచే యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా వీటిలో సమృద్ధిగా ఉంటాయి.
జీర్ణక్రియ నుంచి శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు
రాత్రి పడుకునే ముందు లవంగాన్ని(Cloves) తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. శరీరానికి అవసరమైన ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ K వంటి పోషకాలు లవంగాల్లో లభిస్తాయి. అలాగే ఫ్లేవనాయిడ్లు, యూజినాల్ వంటి క్రియాశీలక సమ్మేళనాలు శరీరాన్ని లోపలినుంచి రక్షిస్తాయి. లవంగాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలైన దగ్గు, జలుబు, కఫం వంటి ఇబ్బందులకు ఉపశమనం కలిగిస్తాయి. వీటిలోని వేడి లక్షణాలు గొంతు నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఒత్తిడి తగ్గించి నిద్రను మెరుగుపరుస్తాయి
లవంగాల్లో ఉన్న సహజ శాంతికారక గుణాలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి గాఢమైన నిద్రకు దోహదపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
నోటి ఆరోగ్యం, గుండె సంరక్షణలో కీలక పాత్ర
లవంగాలను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. పంటి నొప్పి, మసూళ్ల సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. లవంగాల్లోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు నోటి పరిశుభ్రతను కాపాడతాయి.
అలాగే లవంగాల రసం రక్త ప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. అయితే ఇప్పటికే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లవంగాలను నిత్యం తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: