కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉండడం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ముఖ్యంగా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌కు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ మెల్లగా శరీరంలో పేరుకుపోతూ ఉండవచ్చు కానీ కొన్ని చిన్న లక్షణాల ద్వారా దీన్ని ముందుగానే గుర్తించవచ్చు.
కాళ్లలో తిమ్మిరి, చల్లగా అనిపించడం
రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కాళ్లలో తిమ్మిరి(Numbness in legs,) చల్లగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. నడిచేటప్పుడు లేదా నిద్రలో ఇలాంటి భావనలు కలగడం కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న సంకేతం కావచ్చు.

మతిమరుపు, గమన శక్తి లోపం
చిన్న విషయాలను మర్చిపోవడం, పని మధ్యలో ఆలోచన ఆగిపోవడం మెదడుకు తగిన రక్త సరఫరా లేకపోవడం వల్ల జరుగుతుంది. ఇది కొలెస్ట్రాల్ ప్రభావంగా కనిపించవచ్చు.
చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా ఉండడం
చాలా మంది కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అనుభవించే సాధారణ లక్షణాల్లో ఇదొకటి. శరీరంలో రక్తం సరిగా ప్రసరించకపోవడం (Poor blood circulation) దీనికి కారణం.
కళ్ల చుట్టూ తెల్లటి వలయాలు
కళ్ల చుట్టూ తెల్లటి లేదా మచ్చలు వంటి వలయాలు ఏర్పడటం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిన సూచన. ఇది యంగ్ వయసులోనూ కనిపించవచ్చు, అలాంటి సమయంలో వైద్యుని సంప్రదించాల్సిందే.
కళ్ల చుట్టూ లేదా కింద పసుపు రంగు మచ్చలు కనిపిస్తే, అది శరీరంలో ఫ్యాట్ డిపాజిట్స్ పెరిగిన సంకేతంగా పరిగణించవచ్చు.
తక్కువ శ్రమకే అధిక ఆయాసం
మెట్లు ఎక్కేటప్పుడు, కొద్దిగా నడిచిన వెంటనే శ్వాస సమస్యలు లేదా అయాసం రావడం గుండెపై ఒత్తిడి ఉన్నదని సూచించవచ్చు. ఇది కొలెస్ట్రాల్ ప్రభావంతో సంబంధం కలిగి ఉంటుంది.
రాత్రి నిద్ర అలసట వీడకపోవడం
తగిన నిద్ర వచ్చినా రోజంతా అలసినట్లు ఉండటం శరీరానికి సరైన శక్తి అందకపోవడం వల్ల కావచ్చు. ఇది కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు కనిపించే మరో లక్షణం.
అప్రమత్తంగా ఉండండి, తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోండి
ఈ లక్షణాలన్నీ సాధారణ సూచనలే అయినా, ఏదైనా ఆరోగ్య సమస్యపై తేలికగా నిర్ణయం తీసుకోకండి. సరైన పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం మరియు వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను అదుపులో ఉంచవచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Read also: