చూయింగ్ గమ్ నమలడం చాలా మందికి చిన్ననాటి అలవాటు. నోటి దుర్వాసనను తొలగించేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు, ఏకాగ్రత పెంచుకునేందుకు కొంతమంది దీన్ని తరచూ ఉపయోగిస్తారు. ఆటగాళ్లు లేదా విద్యార్థులు పరీక్షల సమయంలో చూయింగ్ గమ్ నమలడం చూస్తుంటాం. కానీ ఈ సరదా అలవాటు మీ శరీరానికి, ముఖ్యంగా మెదడుకు ఏ విధంగా ముప్పుగా మారుతుందో తెలుసుకుంటే తప్పకుండా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.

చూయింగ్ గమ్‌లో మైక్రోప్లాస్టిక్‌లు
చూయింగ్ గమ్ తయారీలో పలు రసాయనాలు, ప్రాసెసింగ్ పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా మైక్రోప్లాస్టిక్‌లు చాలా విస్తృతంగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న కణాలుగా ఉండి, నమలేటప్పుడు లాలాజలంతో కలిసిపోతూ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, ఒక గమ్‌ను నమలడంవల్ల దాదాపు 1 మిలియన్ మైక్రోప్లాస్టిక్ కణాలు నోటిలోకి వెళ్తాయని తేలింది.
ప్లాస్టిసైజర్లు మరియు వాటి ప్రభావం
చూయింగ్ గమ్‌ను ఫ్లెక్సిబుల్ గా ఉంచేందుకు ప్లాస్టిసైజర్ అనే పదార్థాన్ని కలిపి తయారు చేస్తారు. ఇది గమ్‌ను ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తుంది. కానీ ఇదే పదార్థం మన శరీరంలోకి చేరితే, అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ పదార్థాలు రక్తంలోకి ప్రవేశించి, మెదడు వరకు చేరుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధకులు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో, మైక్రోప్లాస్టిక్‌లకు గురైన ఎలుకల్లో జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు గమనించారు. ఈ ప్లాస్టిక్ కణాలు నాడీ కణాలను ప్రభావితం చేస్తూ మెదడులోని చురుకుదనాన్ని తగ్గించాయని తేలింది. దీర్ఘకాలంగా గమ్ నమలడాన్ని కొనసాగిస్తే మన మెదడుపై ఇది తీవ్ర ప్రభావం చూపవచ్చు. మైక్రోప్లాస్టిక్‌లు చూయింగ్ గమ్‌లోనే కాకుండా వివిధ సౌందర్య సాధనాలు, బాటిల్ వాటర్, ఫుడ్ ప్యాకేజింగ్‌లలో కూడా కనిపిస్తాయని వారు చెప్పారు. అయితే చూయింగ్ గమ్‌తో సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం దానిని నేరుగా మన నోటిలోకి నమలడం జరుగుతుంది. ఫలితంగా అది త్వరగా మన లాలాజలంతో కలిసిపోయి శరీరం అంతటా వ్యాపించే అవకాశం ఉంటుంది.

ఆరోగ్య సమస్యలు
జీర్ణ సమస్యలు: మైక్రోప్లాస్టిక్‌లు కడుపులోకి వెళ్లిన తర్వాత జీర్ణతపై ప్రభావం చూపుతాయి.
హార్మోన్ అసమతుల్యత: ప్లాస్టిసైజర్ వంటి రసాయనాలు హార్మోన్ స్రావాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.
వీటమిన్ శోషణలో ఆటంకం: మైక్రోప్లాస్టిక్‌లు కుడిపక్ష జీవక్రియల్లో ఆటంకం కలిగించి శరీరానికి అవసరమైన పోషకాలు శోషించకుండా చేస్తాయి.
పిల్లలపై ప్రభావం
చిన్న పిల్లలు ఎక్కువగా గమ్ నమలే ప్రమాదంలో ఉంటారు. చిన్నారుల మెదడు ఇంకా అభివృద్ధి దశలో ఉండటం వల్ల మైక్రోప్లాస్టిక్‌లు మరింత హానికరంగా మారుతాయి. అలాగే, పిల్లలు గమ్‌ను తినేసే ప్రమాదం కూడా ఉంటుంది.
Read also: Nose Bleeding: వేసవిలో ముక్కు నుంచి రక్తం కారితే ఎం చేయాలి?