Cancer: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ (Cancer) వ్యాధి వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, మనం రోజూ తీసుకునే కొన్ని సాధారణమైన, కానీ ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలవల్ల శరీరంలో క్యాన్సర్ కారక రసాయనాలు పేరుకుపోతున్నాయట. ముఖ్యంగా “అక్రిలామైడ్ (Acrylamide)” అనే రసాయనం ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవే అని పరిశోధనల్లో తేలింది.
అక్రిలామైడ్ అంటే ఏమిటి?
అక్రిలామైడ్ అనేది ఒక రసాయన పదార్థం. ఇది ప్రధానంగా స్టార్చ్ (carbohydrate) కలిగిన ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చినప్పుడు లేదా వేయించినప్పుడు ఏర్పడుతుంది. ముఖ్యంగా 120°C (248°F) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేసినప్పుడు ఈ రసాయనం ఏర్పడుతుంది. లాబొరేటరీ పరీక్షల ప్రకారం ఇది జంతువులలో క్యాన్సర్‌కి కారణమవుతుందని నిరూపించబడింది. అందువల్ల ఇది మనుషులకి కూడా ప్రమాదకరం కావచ్చని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

బంగాళాదుంప చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్
ఈ రోజుల్లో ప్రతి హోటల్లోనూ, స్ట్రీట్ ఫుడ్ కార్నర్‌లోనూ బంగాళదుంప చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్‌లు లభ్యమవుతున్నాయి. అయితే ఇవి తయారవుతున్న ప్రక్రియలో బంగాళదుంపల్లోని సహజ చక్కెరలు, అమైనో ఆమ్లాలు కలిసి అక్రిలామైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా ఇవి బాగా వేయించినప్పుడు లేదా బాగా కాల్చినప్పుడు ఈ రసాయన స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. పరిశోధనల ప్రకారం చిప్స్‌లో 300-2000 µg/kg, ఫ్రెంచ్ ఫ్రైస్‌లలో 200-700 µg/kg వరకు అక్రిలామైడ్ ఉండవచ్చు. దీని నివారణకు గాలిలో వేయించడం లేదా బాగా బ్రౌన్ కాకుండా తక్కువ కాల్చడం మంచిది.

బ్రెడ్ టోస్ట్ – ఎంత కాల్చితే అంత ప్రమాదం
వాకింగ్ ముందు లేదా బ్రేక్‌ఫాస్ట్ సమయంలో టోస్ట్ బ్రెడ్ తినడం చాలామందికి అలవాటు. కానీ ఇది గోధుమరంగులో బాగా కాల్చినపుడు అక్రిలామైడ్ స్థాయిలు బాగా పెరుగుతాయి. సాధారణంగా ఇది 50 నుండి 500 µg/kg వరకు ఉండవచ్చని చెబుతున్నారు. బ్రెడ్‌ను తక్కువగా టోస్ట్ చేయడం, మితంగా తీసుకోవడం ద్వారా దీని ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

ప్యాక్ చేసిన బిస్కెట్లు, చిప్స్
ఇవీ కూడా క్యాన్సర్ రిస్క్ కలిగించే ఆహారాలలో ఒకటి. ఎందుకంటే వీటిని తయారుచేసేటప్పుడు అధిక ఉష్ణోగ్రతల్లో బేకింగ్ చేయడం వలన అక్రిలామైడ్ స్థాయి పెరిగిపోతుంది. ముఖ్యంగా చక్కెర, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి ముప్పుగా మారతాయి. ప్యాకేజ్డ్ బిస్కెట్లలో 160-1000 µg/kg వరకు అక్రిలామైడ్ ఉండవచ్చని అధ్యయనాలు వెల్లడించాయి. వీటిని రోజూ తీసుకోవడం చాలా ప్రమాదకరం.

కాఫీ – వేడి మోతాదులోనే ప్రమాదం
అన్నీ తాగదగిన పదార్థాల్లో కాఫీ కూడా ఈ జాబితాలో ఉంది. ఎందుకంటే కాఫీ గింజలను వేయించినప్పుడు అక్రిలామైడ్ రూపంలో క్యాన్సర్ కారక రసాయనం ఉత్పత్తి అవుతుంది. బ్రూ చేసిన కాఫీలో 5-20 µg/L, ఇన్‌స్టంట్ కాఫీ పొడిలో 100-400 µg/kg వరకు ఉండవచ్చు. రోజూ ఎక్కువ కాఫీ తాగడం వల్ల దీని ప్రభావం నెమ్మదిగా but ఖచ్చితంగా పడుతుంది.
అల్పాహార తృణధాన్యాలు – దాగిన ప్రమాదం
చిల్డ్రన్ బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్‌గానీ, పఫ్ చేసిన కార్న్ ఫ్లేక్స్, వీటిలో కూడా అక్రిలామైడ్ ఉండే అవకాశం ఉంది. వీటిని అధిక వేడి వద్ద ప్రాసెస్ చేయడం వలన, ముఖ్యంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించినపుడు ప్రమాద స్థాయి పెరుగుతుంది. దీని బదులు ఇంట్లో వండిన పోహా, ఉప్పు oats, గోధుమ రవ్వ వంటి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఏం చేయాలి? – ఆరోగ్య నిపుణుల సూచనలు
తక్కువ వేడి వద్ద వండిన ఆహారమే తీసుకోవాలి.
బాగా కాల్చిన, అధిక వేయించిన పదార్థాలను నివారించాలి.
ప్యాక్ చేసిన స్నాక్స్‌ను తగ్గించాలి.
ఇంట్లో తయారైన తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎంచుకోవాలి.
బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చిన పదార్థాల వాడకాన్ని నియంత్రించాలి.
Read also: Ginger, garlic paste: కల్తీ అల్లం,వెల్లుల్లి పేస్ట్ ను గుర్తించడం ఎలా?