ప్రతి రోజు మజ్జిగ (Buttermilk) తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా, మజ్జిగలో ఒక చెంచా అల్లం రసం కలిపి తాగడం వల్ల శరీరానికి లాభాలు రెట్టింపు అవుతాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
అల్లంలో ఉన్న జింజెరాల్ అనే యాక్టివ్ కాంపౌండ్ జీర్ణ వ్యవస్థను ఉత్తేజితంగా ఉంచుతుంది. మజ్జిగ (Buttermilk) లోని ప్రోబయాటిక్స్ తో కలిపి ఇది జీర్ణతను మెరుగుపరచడం (improving digestion) లో సహాయపడుతుంది. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బిపోవడం వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
రోజూ గ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తాగితే మెటబాలిజం వేగవంతం (Speed up metabolism) అవుతుంది. ఇది శరీరంలో కొవ్వు కణాల దహనాన్ని ప్రోత్సహిస్తుంది. ఎక్కువ కేలరీలను ఖర్చు చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అల్లం మరియు మజ్జిగ రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. అలాగే, లాక్టోజ్, బీ-విటమిన్లు, మినరల్స్ మజ్జిగలో ఉండడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్
అల్లం సహజమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది జీర్ణ మార్గంలోని ఇర్రిటేషన్‌ను తగ్గిస్తుంది. మజ్జిగ చల్లదనాన్ని కలిగించే లక్షణంతో కలసి ఇది గ్యాస్, గుండె మంటగా, అల్సర్లు వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.
రక్తహీనతకు నివారణ
మజ్జిగలోని కాల్షియం, విటమిన్ బి12, మరియు ప్రోటీన్లు రక్తహీనత నివారణలో ఉపయోగపడతాయి. అల్లంలో ఉన్న ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హేమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఆకలి పెరగడం – లివర్ ఆరోగ్యం
మధ్యాహ్నం సమయంలో మజ్జిగలో కొద్దిగా అల్లం రసం, ఉప్పు, కొత్తిమీర కలిపి తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. లివర్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. ఫుడ్డు డైజెస్టన్ మెరుగవుతుంది.
వాపును తగ్గిస్తుంది
అల్లాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ముఖ్యంగా ఆర్థరైటిస్, మసిల్ పైన్ వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. వేసవిలో మాత్రమే కాకుండా, మజ్జిగ – అల్లం కాంబినేషన్‌ను సంవత్సరమంతా తీసుకోవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రతను సరిగ్గా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, మరియు హైడ్రేషన్‌ను కాపాడడంలో సహాయపడుతుంది.
మీ రోజువారీ ఆహారంలో మజ్జిగలో చెంచా అల్లం కలిపి తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది సహజమైన, రసాయన రహితమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో ఒక సులువైన మార్గం. ప్రాకృతిక చిట్కాలు అనుసరించాలనుకునే వారందరికీ ఇది ఒక మంచి పరిష్కారం .
Read hindi news: hindi.vaartha.com
Read also: Brain tumor: బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు