కోడిగుడ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కొందరు గుడ్లను ఉడకబెట్టి తింటే కొందరు ఆమ్లెట్ అంటే ఇష్టపడతారు. ఇంకొందరు కోడిగుడ్డు వేపుడు, టమాటా వంటి కూరలను చేసుకుని తింటారు. అయితే కోడిగుడ్లను ఏ విధంగా తిన్నా కూడా రుచిగానే ఉంటాయి. కానీ మనకు మార్కెట్‌లో రెండు రకాల కోడిగుడ్లు అందుబాటులో ఉన్నాయి. బ్రౌన్ కలర్‌లో ఉండే గుడ్లు కొన్ని అయితే, తెలుపు రంగు పెంకు(Brown Vs White Eggs)తో ఉండే కోడిగుడ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది తమ ఇష్టానికి, లభ్యతకు అనుగుణంగా ఆయా గుడ్లను కొనుగోలు చేసి తింటుంటారు. అయితే వాస్తవానికి ఈ రెండు రకాల గుడ్లలో ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి..?

ప్రోటీన్లు అధికం
పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం గోధుమ రంగు గుడ్లు, తెలుపు రంగు గుడ్లలో (Brown Vs White Eggs)పోషకాల్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. రెండూ ఒకేలాంటి పోషకాలను కలిగి ఉంటాయి. కోళ్లు అవి తినే దాణా, వాటి జన్యువుల కారణంగా అవి పెట్టే గుడ్ల పెంకు గోధుమ లేదా తెలుపు రంగులో (Brown Vs White Eggs)ఉంటుంది. కానీ రెండు రకాల గుడ్లలోనూ ఒకేలాంటి పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా కోళ్లకు ఉండే ఈకల రంగును బట్టి గుడ్ల రంగు మారుతుంది. గోధుమ రంగులో ఈకలను కలిగి ఉండే కోళ్లు ఎక్కువగా అదే రంగు గుడ్లను పెడతాయి. అదే తెలుపు రంగు ఈకలను కలిగి ఉండే కోళ్లు తెలుపు రంగులో పెంకులు కలిగి ఉండే గుడ్లను పెడతాయి. అధిక శాతం ఇలాగే జరుగుతుంది. ఇక రెండు రకాల గుడ్లలోనూ పోషకాల్లో పెద్దగా తేడాలు ఉండవు. రెండింటిలోనూ ప్రోటీన్లు అధికం (High in proteins)గా ఉంటాయి. విటమిన్లు డి, బి12, ఎ అధికంగా ఉంటాయి. అలాగే సెలీనియం, ఫాస్ఫరస్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు కోలిన్ కూడా అధిక మొత్తంలో లభిస్తుంది. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మెటబాలిజం మెరుగు పడేలా చేస్తాయి. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
సహజసిద్ధమైనవి
సాధారణంగా గోధుమ రంగు పెంకు కలిగిన కోడిగుడ్లు కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవే గుడ్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయని, ఇవే గుడ్లు ఎక్కువ లాభాలను అందిస్తాయని చాలా మంది నమ్ముతారు. కానీ ఇందులో నిజం లేదని, పెంకు ఏ రంగులో ఉన్నా సరే పోషకాలు మాత్రం ఒకేలా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల కోళ్లు ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే బ్రౌన్ కలర్ కోడిగుడ్లను ఎక్కువ మొత్తంలో పెద్ద సైజులో పెట్టే అవకాశాలు ఉంటాయి. కొందరు బ్రౌన్ కలర్ కోడిగుడ్లను సహజసిద్ధమైనవిగా భావిస్తారు. కానీ ప్రస్తుతం ఫామ్‌లలోనూ ఇలాంటి గుడ్లను పెట్టే కోళ్లనే పెంచుతున్నారు. కనుక మీరు కొనుగోలు చేస్తున్న కోడిగుడ్లు ఫామ్ నుంచి వచ్చినవా.. లేక నాటు కోడిగుడ్లా.. అన్న విషయాన్ని ధ్రువీకరించుకుని అప్పుడు గుడ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఫామ్ కోడిగుడ్లు బ్రౌన్ కలర్‌లో ఉన్నా వాటిల్లో తెల్లని గుడ్లతో పోలిస్తే పోషకాలు పెద్దగా ఏమీ ఎక్కువ ఉండవు. కానీ నాటు కోడిగుడ్లలో పోషకాల పరిమాణం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నాటుకోళ్లను గ్రామాల్లో ఇళ్లలో పెంచుతారు. వాటికి స్వచ్ఛమైన దాణా లభిస్తుంది. కనుక అవి పెట్టే గుడ్ల సైజు తక్కువగా ఉన్నప్పటికీ ఆ గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఏ గుడ్లను అయినా సరే తాజాగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించిన తరువాతే వాటిని కొనుగోలు చేయాలి. లేదంటే పాడైన గుడ్లను కొనే అవకాశం ఉంటుంది.
ఏ రంగు గుడ్డు ఆరోగ్యకరమైనది?
పెంకు రంగు మాత్రమే భిన్నంగా ఉంటుంది. మీరు ఒమేగా-3 సమృద్ధిగా ఉన్న గుడ్లను ఎంచుకోనంత వరకు, కోళ్ల ఆహారం అదనపు ఒమేగా-3 ప్రయోజనాలను అందించడానికి మెరుగుపరచబడినంత వరకు, గోధుమ మరియు తెలుపు గుడ్లు పోషక పరంగా ఒకేలా ఉంటాయి. కాబట్టి మీరు దృశ్యమానంగా రంగును ఇష్టపడితే తప్ప నిర్దిష్ట గోధుమ గుడ్డు ప్రయోజనాలు లేవు!
గోధుమ రంగు గుడ్లు ఎందుకు ఖరీదైనవి?
గోధుమ గుడ్లు తరచుగా ఖరీదైనవి ఎందుకంటే వాటిని పెట్టే పెద్ద, బరువైన కోళ్ళు వాటి బరువును నిర్వహించడానికి ఎక్కువ మేత అవసరం, ఇది ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది. అదనంగా, లెఘోర్న్ వంటి తెల్ల గుడ్లు పెట్టే జాతులు చిన్నవిగా మరియు వాణిజ్యపరంగా సామూహిక ఉత్పత్తికి మరింత సమర్థవంతంగా ఉంటాయి, దీనివల్ల గుడ్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది మరియు గుడ్డుకు తక్కువ ఖర్చు అవుతుంది. వినియోగదారులు కొన్నిసార్లు గోధుమ గుడ్లను ప్రీమియం ఉత్పత్తిగా గ్రహిస్తారు మరియు ఈ అవగాహన అధిక ధరకు కూడా దోహదం చేస్తుంది.
గోధుమ రంగు గుడ్ల ప్రత్యేకత ఏమిటి?
గోధుమ రంగు గుడ్లు తెల్ల గుడ్ల కంటే ఆరోగ్యకరమైనవి కాకపోవచ్చు, కానీ అవి ఒకేలాంటి పోషక ప్రయోజనాలను అందిస్తాయి. కొన్ని అధ్యయనాలు గోధుమ రంగు గుడ్లలో తెల్ల గుడ్లతో పోలిస్తే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చని సూచిస్తున్నాయి, ముఖ్యంగా కోళ్లకు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: