చర్మం కాంతివంతంగా కనిపించాలనే ఆకాంక్షతో చాలామంది బ్లీచ్‌ను ఉపయోగిస్తారు. కానీ బ్లీచ్‌లో ఉన్న(Bleach Tips) రసాయనాలు చర్మానికి నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే బ్లీచ్ అప్లై చేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన విధంగా బ్లీచ్ చేస్తే ట్యాన్ తగ్గుతుంది, చర్మం మృదువుగా మారుతుంది, ముఖం తక్షణ కాంతిని అందుకుంటుంది.

బ్లీచ్ వాడకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బ్లీచ్(Bleach Tips) అప్లై చేయకముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే రోమ కూపాలు ఓపెన్ అవుతాయి. దీని వల్ల బ్లీచ్ చర్మంపై సమర్థవంతంగా పని చేస్తుంది. అలాగే బ్లీచ్ చేసేముందు తప్పనిసరిగా తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచి బ్లీచ్ వల్ల వచ్చే ఇర్రిటేషన్‌ను తగ్గిస్తుంది. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే బ్లీచ్ పెట్టడం మాత్రం పూర్తిగా తప్పు. సూర్యరశ్మి వల్ల వేడెక్కిన చర్మంపై బ్లీచ్ వేస్తే అలర్జీలు, ఎర్రదనం, మరింత నష్టం జరుగుతుంది. కనీసం అరగంట గ్యాప్ ఇవ్వడం మంచిది.
బ్లీచ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బ్లీచ్ చేసిన వెంటనే చర్మం సున్నితంగా మారుతుంది కాబట్టి కనీసం 24 గంటలు కఠినమైన కెమికల్ ఫేస్ వాష్‌లు, స్క్రబ్బులు, ఫేస్ ప్యాక్‌లు వాడరాదు. బయటకు వెళ్లాల్సి వచ్చితే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. దీని వల్ల ట్యానింగ్ తగ్గి, బ్లీచ్ చేసిన చర్మం రక్షణ పొందుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత అలొవెరా జెల్, రోస్ వాటర్ వంటి సహజ పదార్థాలతో చర్మాన్ని శాంతింపచేయడం మంచిది. ఇవి చర్మానికి హైడ్రేషన్ ఇచ్చి ఇర్రిటేషన్ తగ్గిస్తాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :