Bihar: బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో హెచ్ఐవీ (HIV) కేసులు ఆందోళనకర స్థాయికి చేరాయి. జిల్లా ఏఆర్‌టీ కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 7,400 మందికి పైగా హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారించబడగా, వీరిలో 400 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ఈ పిల్లలకు వైరస్ వారి తల్లిదండ్రుల నుంచే ప్రసవ సమయంలో సంక్రమించినట్లు వైద్యులు వివరించారు. ప్రజల్లో అవగాహన లోపం, వివాహాల ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం, వలసలు, సామాజిక వివక్ష కారణంగా హెచ్ఐవీ టెస్టులను నివారించడం వంటి కారణాలు ఈ పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
Read also: Health: ఈ విటమిన్లు తగ్గితే లివర్ దెబ్బతింటుంది!

7400 HIV cases in a single district
నెలకు 40 నుండి 60 కొత్త కేసులు
Bihar: ప్రస్తుతం సీతామఢీ ఏఆర్‌టీ కేంద్రంలో నెలకు 40 నుండి 60 కొత్త కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు 5,000 మంది రోగులకు చికిత్స అందుతోంది. పరిస్థితి మరింత క్షీణించకుండా జిల్లా యంత్రాంగం అవగాహన కార్యక్రమాలను బలోపేతం చేస్తోంది. గ్రామాల్లో కమ్యూనిటీ పరీక్షా కేంద్రాల ఏర్పాటు, సురక్షిత లైంగిక పద్ధతులపై అవగాహన కల్పించడం, కలుషిత సూదుల వినియోగంపై హెచ్చరికలు వంటి కార్యక్రమాలను చేపడుతోంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే నెలల్లో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: