మనం సాధారణంగా బంగారం, వెండితో చేసిన ఆభరణాలను ధరిస్తూ ఉంటాం. ఇవి మనకు ఎంతో అందాన్ని, తేజస్సును తీసుకువస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో వీటిని మనం కొనుగోలు చేసే పరిస్థితి లేదనే సంగతి మనకు తెలిసిందే. బంగారం, వెండికి బదులుగా మనం రాగితో చేసిన ఆభరణాలను కూడా ధరించవచ్చు. పూర్వకాలం నుండి రాగి ఆభరణాలు (Copper Jewellery)వాడుకలో ఉన్నాయి. రాగి కంకణాలు, రాగి ఉంగరాల వంటి వాటిని ధరించడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఆభరణాలను శుభ్రం చేయడం కూడా చాలా తేలిక. రాగి ఆభరణాలను ధరించడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
Read Also: Diabetes: సైలెంట్ కిల్లర్‌గా మారిన కిడ్నీ వ్యాధి

ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి
సహజంగానే రాగి శోథ నిరోధక గుణాన్ని కలిగి ఉంటుంది. కనుక రాగి ఆభరణాలను (Copper Jewellery) ధరించడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో వాపులతో బాధపడే వారు రాగి ఆభరణాలను ధరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాగి ఆభరణాలను ధరించడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తప్రసరణ వేగం పెరగడం వల్ల చర్మం, వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహించడం కూడా చాలా అవసరం. రాగి ఆభరణాలను ధరించడం వల్ల శరీరం మనం తీసుకునే ఆహారం నుండి ఖనిజాలను ఎక్కువగా గ్రహిస్తుంది. ఈ ఆభరణాలను ధరించడం వల్ల ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలను శరీరం ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో శరీరంలో ఐరన్, జింక్ వంటి పోషకాల లోపం లేకుండా ఉంటుంది.

వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి
రాగి ఆభరణాలను ధరించడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో రాగి ఆభరణాలు మనకు ఎంతో సహాయపడతాయి. రాగి ఆభరణాలను ధరించడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా ఉంటారు. రాగి ఆభరణాలను ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా రాగి ఆభరణాలు మనకు అందాన్ని తీసుకు రావడమే రాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: