అత్యధికంగా ఆయిల్ ఉత్పత్తి అయ్యే చర్మంపై మేకప్(Beauty Tips) వేసుకుంటే కొద్దిసేపట్లోనే చెదిరిపోవడం, కేక్‌లా కనిపించడం, ప్యాచీగా మారడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే మొదటి స్టెప్‌గా చర్మాన్ని సరిగ్గా సిద్ధం చేయాలి.
- డీప్ క్లీన్సింగ్: అతి తేలికపాటి ఫోమ్ క్లెన్సర్‌తో ముఖం కడిగితే చర్మంపై ఉన్న ఆయిల్, డస్ట్ తొలగిపోయి మేకప్ సెట్ అవ్వడానికి సహకరిస్తుంది.
- ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్: తేమను ఇచ్చే ఈ క్రీమ్ చర్మాన్ని పొడిబారకుండా, మేకప్‌కు స్మూత్ బేస్‌ను ఇస్తుంది.

ప్రైమర్‌తో పోర్స్ కవర్ – మేకప్ లాంగ్ లాస్టింగ్
ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ప్రైమర్ అన్నది మేకప్‌లో(Beauty Tips) కీలక పాత్ర పోషిస్తుంది.
- సిలికాన్ బేస్డ్ ప్రైమర్ చర్మంపై తక్షణ ఎఫెక్ట్ ఇస్తూ, రంధ్రాలను చిన్నగా కనిపించేలా చేస్తుంది.
- ఇది మేకప్ మొత్తం జారిపోకుండా, ఎక్కువసేపు తాజా లుక్ ఇస్తుంది.
- ఈ ప్రైమర్ “బ్లర్ టూల్” లా పనిచేసి చిన్న లోపాలను కప్పేస్తుంది.
ఆయిల్-ఫ్రీ మ్యాట్ ఫౌండేషన్ – స్మూత్ & నేచురల్ ఫినిష్
ఆయిలీ స్కిన్‌కు మ్యాట్ ఫినిష్, లైట్వెయిట్, లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ బెస్ట్ ఆప్షన్.
- ప్యారబెన్-ఫ్రీ, నాన్-కామెడోజెనిక్ ఫౌండేషన్‌ను ఎంచుకుంటే పోర్స్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉండదు.
- బ్యూటీ బ్లెండర్ లేదా స్టిప్లింగ్ బ్రష్‌తో తేలికగా తిరిగుతూ అప్లై చేస్తే నేచురల్ గ్లో వస్తుంది.
సెట్టింగ్ పౌడర్ – ఆయిల్ కంట్రోల్‌కు బెస్ట్ ఫ్రెండ్
- ఫౌండేషన్ తర్వాత ట్రాన్స్‌లూసెంట్ సెట్టింగ్ పౌడర్ ఉపయోగిస్తే ఆయిల్ బయటకు రాకుండా కంట్రోల్‌లో ఉంచుతుంది.
- ముఖ్యంగా T-జోన్ (నుదురు, ముక్కు, చిన్ని) ప్రాంతాల్లో లైట్ ప్రెసింగ్‌తో పౌడర్ వేస్తే మరింత బెటర్.
పౌడర్ బేస్డ్ బ్లష్ & కాంటౌర్ – నేచురల్ లుక్
లిక్విడ్ లేదా క్రీమ్ బ్లష్‌లు ఆయిల్‌ను పెంచే అవకాశం ఉన్నందున:
- పౌడర్ బ్లష్
- మ్యాట్ కాంటౌర్
- సబ్టిల్ హైలైటర్
ఇవన్నీ ఫేషియల్ ఫీచర్లను డిఫైన్ చేస్తూ ఓ వెల్వెట్ ఫినిష్ ఇస్తాయి.
సెట్టింగ్ స్ప్రే – మేకప్ ఫైనల్ లాక్
- చివరలో ఆయిల్-కంట్రోల్ సెట్టింగ్ స్ప్రే వాడితే మొత్తం మేకప్ 8–10 గంటలు సులభంగా నిలుస్తుంది.
- ఇది మేకప్‌ను కేకీగా కాకుండా, ఫ్రెష్‌గా ఉంచుతుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: