हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Ayurveda Rules : ఆయుర్వేద నియ‌మాల‌ను పాటిస్తే 100 ఏళ్ల ఆరోగ్యం..

Sudha
Latest Telugu news : Ayurveda Rules : ఆయుర్వేద నియ‌మాల‌ను పాటిస్తే 100 ఏళ్ల ఆరోగ్యం..

ఆయుర్వేదానికి ఎన్నో వేల ఏళ్ల చ‌రిత్ర ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచీన‌మైన వైద్య విధానాల్లో ఆయుర్వేదం ఒకటిగా పేరుగాంచింది. గ‌తంలో ఆయుర్వేద వైద్యానికి అంత‌గా ప్రాధాన్య‌త ఉండేది కాదు. కానీ ప్ర‌స్తుతం చాలా మంది ఈ వైద్య విధానంలో చికిత్స పొందేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. భార‌తీయ సంప్ర‌దాయ వైద్య విధానమైన ఆయుర్వేదానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఆద‌ర‌ణ సైతం ల‌భిస్తోంది. అయితే ఆయుర్వేద అంటే కేవ‌లం ఔష‌ధాలు మాత్ర‌మే కాదు, మ‌న జీవ‌న విధానానికి సంబంధించి అనేక సూత్రాల‌ను అందించింది. కానీ చాలా మంది వాటిని పాటించ‌డం లేదు. ఆహార‌పు అల‌వాట్ల‌తోపాటు ఆరోగ్యం విష‌యంలోనూ ఆయుర్వేదం ప‌లు సూత్రాల‌ను, నియ‌మాల‌ను (Ayurveda Rules)రూపొందించింది. వాటిని పాటిస్తే మ‌న జీవ‌న విధానం మెరుగు ప‌డ‌డ‌మే కాదు, రోగాలు రాకుండా చూసుకోవ‌చ్చు. 100 ఏళ్ల పాటు ఎలాంటి రోగాలు రాకుండా దీర్ఘాయుష్షుతో జీవ‌నం సాగిస్తారు.

Ayurveda Rules : ఆయుర్వేద నియ‌మాల‌ను పాటిస్తే 100 ఏళ్ల ఆరోగ్యం..
Ayurveda Rules : ఆయుర్వేద నియ‌మాల‌ను పాటిస్తే 100 ఏళ్ల ఆరోగ్యం..

గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి

చాలా మంది ఉద‌యం నిద్ర‌లేచిన వెంట‌నే టీ లేదా కాఫీల‌ను ప‌ర‌గడుపునే సేవిస్తుంటారు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. అలా కాకుండా టీ, కాఫీల‌ను తాగితే పొట్ట‌లో యాసిడ్ల ప్ర‌భావం పెరిగి దీర్ఘ‌కాలంలో అల్స‌ర్లు, ఇత‌ర జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు వచ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఉద‌యం ప‌ర‌గ‌డుపున గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉండ‌డంతోపాటు శ‌రీరంలోని వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే బ‌రువు కూడా త‌గ్గుతారు. ఇక చాలా మంది త‌మ బ‌రువును చెక్ చేసుకోరు. ఆయుర్వేద (Ayurveda Rules)చెబుతున్న ప్రకారం క‌నీసం 3 లేదా 4 రోజుల‌కు ఒక‌సారి అయినా లేదా వారానికి ఒక‌సారి అయినా శ‌రీర బ‌రువును క‌చ్చితంగా చెక్ చేసుకోవాలి. దీని వ‌ల్ల మీరు ఎంత బ‌రువు ఉన్నారు, త‌గ్గాలా, పెర‌గాలా అన్న విష‌యం సుల‌భంగా అర్థ‌మ‌వుతుంది. దాన్ని బ‌ట్టి బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు.

జీర్ణాశయంలో పావు వంతు ఖాళీ ఉంచాలి

చాలా మంది త‌మ శ‌రీర బ‌రువుకు త‌గిన విధంగా ఆహారాల‌ను తిన‌రు. బ‌రువు ఎక్కువ‌గా ఉన్న‌వారు ఇంకా ఎక్కువ ఆహారాల‌ను తింటారు. త‌క్కువ బ‌రువు ఉన్న‌వారు స‌రిగ్గా ఆహారం తినరు. ఈ ప‌ద్ధ‌తిని మార్చుకోవాలి. మీ శ‌రీర బ‌రువుకు త‌గిన‌ట్లుగా రోజూ ఆహారం తినాల్సి ఉంటుంది. ఆయుర్వేద ప్ర‌కారం (Ayurveda Rules)రోజూ ఒకే సమయానికి భోజనం చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకే సమయానికి ఆహారాన్ని తినాలి. తీసుకునే భోజనంలో ద్రవ, ఘనాహారాలు ఉండాలి. జీర్ణాశయంలో పావు వంతు ఖాళీ ఉంచాలి. అప్పుడే ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. భోజనానికి, భోజనానికి మధ్య కనీసం 4 నుంచి 5 గంటల వ్యవధి ఉండాలి. రోజులో ఒక్కసారి అయినా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి భోజనం చేయాలి.

Ayurveda Rules : ఆయుర్వేద నియ‌మాల‌ను పాటిస్తే 100 ఏళ్ల ఆరోగ్యం..
Ayurveda Rules : ఆయుర్వేద నియ‌మాల‌ను పాటిస్తే 100 ఏళ్ల ఆరోగ్యం..

వ్యాయామం చాలా అవసరం

భోజనం చేసేటప్పుడు నీరు అస్సలు తాగరాదు. తప్పదనుకుంటే చాలా స్వల్పంగా నీటిని తాగాలి. భోజనానికి ముందు, భోజనం చేసేటప్పుడు, చేశాక ఎట్టి పరిస్థితిలోనూ చల్లని నీరు, పానీయాలను తాగరాదు. వారంలో ఒక్కసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేయాలి. ఇందుకు నువ్వుల నూనెను వాడితే మంచిది. దీని వ‌ల్ల శ‌రీరం తేలిగ్గా మారుతుంది. చ‌క్క‌ని వ‌ర్చ‌స్సు సొంత‌మ‌వుతుంది. వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే శరీరం ఉన్న స్థితిని బట్టి నిత్యం వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారంలో కనీసం 3 రోజులు వ్యాయామం చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఇత‌ర వ్య‌క్తులు వారంలో క‌నీసం 5 రోజులు, రోజుకు 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఇలా ఆయుర్వేద ప్రకారం ప‌లు నియమాల‌ను పాటిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారు. 100 ఏళ్ల వ‌ర‌కు ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేకుండా జీవిస్తారు.

ఆయుర్వేద స్థాపకుడు ఎవరు?

ప్రాచీన భారతీయ వైద్య వ్యవస్థకు, ముఖ్యంగా పునాది గ్రంథమైన చరక సంహితను సంకలనం చేయడానికి ఆచార్య చరకుడు “ఆయుర్వేద పితామహుడు”గా పరిగణించబడ్డాడు. ఈ వ్యవస్థకు పురాతన మూలాలు ఉన్నప్పటికీ, సుశ్రుతుడు మరియు ధన్వంతరితో పాటు చరకుడు దాని కీలక గ్రంథాలను సంకలనం చేసి, దాని పునాదులు వేసిన మార్గదర్శకులు మరియు ప్రధాన రచయితలుగా పరిగణించబడ్డారు.

ఆయుర్వేద దేవుడు ఎవరు?

హిందూ మతం ఆయుర్వేద దేవుడు ధన్వంతరి, దైవిక వైద్యుడు మరియు విష్ణువు అవతారం, పౌరాణిక సముద్ర మథనం సమయంలో మానవాళికి ఆయుర్వేద జ్ఞానాన్ని అందించినందుకు ఆయనను పూజిస్తారు. మంచి ఆరోగ్యం మరియు వ్యాధుల నివారణ కోసం ఆయనను పూజిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870