శారీరకంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ 45 ఏళ్లలోపు వయసువారిలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణంగా గుండె(Sudden Death) సంబంధిత సమస్యలే నిలుస్తున్నాయని ఐజేఎంఆర్ (IJMR) తాజా నివేదిక స్పష్టం చేసింది. పెరుగుతున్న ఒత్తిడి, అసమతుల్య జీవనశైలి, ధూమపానం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్లు యువత గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్న వయసులోనే గుండె జబ్బులు(Sudden Death) రావడానికి ప్రధానంగా అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి, పని ఒత్తిడి కారణమవుతున్నాయి. అందువల్ల యువత ఇప్పటికైనా అప్రమత్తమై జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వారు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: