ఆయుర్వేదంలో మునగ ఆకులు(Moringa Benefits) సహజ ఔషధంగా ప్రాచుర్యం పొందాయి. వీటిని కూరగా, వేపుడిగా, పొడిగా, కషాయంగా – అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మునగలో ఉన్న సహజ పోషకాలు శరీరానికి కావాల్సిన విటమిన్లు–ఖనిజాలను సమతుల్యంగా అందిస్తాయి.
NCBI నివేదికల ఆధారంగా మునగ ఆకుల్లో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మ్యగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు విటమిన్ A, C, B-కాంప్లెక్స్, బీటాకెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. సహజ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే 40కుపైగా పదార్థాలు వీటిలో ఉండటం వల్ల శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

మునగ ఆకుల్లో(Moringa Benefits) ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. గ్యాస్–అజీర్ణం వంటి సమస్యలు తగ్గడమే కాకుండా కడుపు ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేస్తుంది. అదేవిధంగా ఖనిజాల సమృద్ధి కారణంగా ఎముకలను దృఢంగా మార్చడంలో మునగ వండిన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.
మునగ ఆకులు రక్తహీనతను తగ్గించడంలో కూడా శ్రేయస్కరం. ఐరన్ అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే గుణం ఉండటం వల్ల మధుమేహానికి కూడా ఉపశమనం ఇవ్వగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి అవసరమైన ఇమ్యూనిటీని పెంచడంలో మునగలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వాతావరణ మార్పులు, సీజనల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్న సమయంలో మునగ ఆకులను ఆహారంలో చేర్చుకోవడం మంచిదిగా భావిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: