हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

Raisins : కిస్మిస్‌ల‌ను తింటే ఎన్ని ప్రయోజ‌నాలో..

Sudha
Raisins : కిస్మిస్‌ల‌ను తింటే ఎన్ని ప్రయోజ‌నాలో..

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల డ్రై ఫ్రూట్స్‌లో కిస్మిస్‌లు ( Raisins) విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి. ఇవి ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా స్వీట్ల తయారీలో, పులావ్‌లలో, కొన్నిరకాల ఆహారాల్లో అలంకారంగా, రుచిని పెంచే పదార్థంగా వాడుతున్నాం. కానీ వీటి ప్రయోజనాలు రుచి వరకే పరిమితం కావు. ఆరోగ్య పరంగా కూడా కిస్మిస్‌లు (Raisins) ఎంతో ఉపయోగకరమైనవి.అయితే కిస్మిస్‌ల‌ను రోజూ నీటిలో నాన‌బెట్టి తింటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు (Health benefits)క‌లుగుతాయ‌ని పోష‌కాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. కానీ కిస్మిస్‌ల‌ను ( Raisins) అస‌లు రోజుకు ఎన్ని తినాలి.. అనే సందేహం వ‌స్తుంటుంది. కిస్మిస్‌ల‌ను పెద్ద‌లు అయితే రోజుకు 50 గ్రాముల వ‌ర‌కు తిన‌వ‌చ్చు. నీటిలో నాన‌బెట్టి తింటే పోష‌కాలు శ‌రీరానికి స‌రిగ్గా ల‌భిస్తాయి. పిల్ల‌ల‌కు అయితే 20 గ్రాముల మేర కిస్మిస్‌ల‌ను రోజూ నీటిలో నాన‌బెట్టి తినిపించ‌వ‌చ్చు. దీంతో సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి.

 Raisins : కిస్మిస్‌ల‌ను తింటే ఎన్ని ప్రయోజ‌నాలో..
Raisins : కిస్మిస్‌ల‌ను తింటే ఎన్ని ప్రయోజ‌నాలో..

ర‌క్త‌పోటు నియంత్రించేందుకు

కిస్మిస్‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు వ్యాధుల‌ను నయం చేసుకోవ‌చ్చు. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది స‌హ‌జ‌సిద్ధ‌మైన లాక్సేటివ్‌గా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల కిస్మిస్‌ల‌ను తింటే పేగుల్లో మ‌లం క‌ద‌లిక‌లు సాఫీగా జ‌రుగుతాయి. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గిపోతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి పూట కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం తింటే శ‌రీరం చాలా వ‌ర‌కు పోష‌కాల‌ను సుల‌భంగా గ్ర‌హిస్తుంది. అలాగే సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి కూడా. కిస్మిస్‌ల‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది ర‌క్త‌పోటు నియంత్రించేందుకు స‌హాయం చేస్తుంది. వీటిల్లో పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారి నుంచి రక్షణ

కిస్మిస్‌ల‌ను రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి వాటిని ఉద‌యం తింటే శ‌రీరానికి త‌క్ష‌ణ‌మే శక్తి ల‌భిస్తుంది. బ‌ద్ద‌కం పోతుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. రోజంతా శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీర‌సం, అల‌స‌ట ఉండ‌వు. ఎంత ప‌నిచేసినా చురుగ్గానే ఉంటారు. కిస్మిస్‌ల‌లో పిండి ప‌దార్థాలు, గ్లూకోజ్‌, ఫ్ర‌క్టోజ్ అనే స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు ఉంటాయి. ఇవి త‌క్ష‌ణ శ‌క్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. కిస్మిస్‌ల‌లో ఫినాల్స్, పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండ‌డం కార‌ణంగా ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారి నుంచి శ‌రీరాన్ని ర‌క్షిస్తాయి. క‌ణాలకు జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తాయి. శ‌రీరంలో అంత‌ర్గతంగా వ‌చ్చే వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండ‌వ‌చ్చు.

 Raisins : కిస్మిస్‌ల‌ను తింటే ఎన్ని ప్రయోజ‌నాలో..
Raisins : కిస్మిస్‌ల‌ను తింటే ఎన్ని ప్రయోజ‌నాలో..

రక్తం వృద్ధి

కిస్మిస్‌ల‌లో ఎముక‌ల ఆరోగ్యానికి అవ‌స‌రం అయిన అనేక పోష‌కాలు ఉంటాయి. క్యాల్షియం, మెగ్నిషియం, బోరాన్ అధికంగా ఉంటాయి. బోరాన్ వ‌ల్ల కిస్మిస్‌ల‌లో ఉండే క్యాల్షియం, మెగ్నిషియంల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఆర్థ‌రైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక‌ల సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. కిస్మిస్‌ల‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర ర‌క్త క‌ణాలు ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. ర‌క్తం త‌క్కువ‌గా ఉన్న‌వారు సాధార‌ణ కిస్మిస్‌ల‌కు బ‌దులుగా న‌లుపు రంగులో ఉండే కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టి తింటే ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ఇలా కిస్మిస్‌ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

ఎండుద్రాక్షకు భారతీయ పేరు ఏమిటి?

ఎండిన పండ్లు అంటే ఎండిన ద్రాక్ష. వీటిని భారతదేశంతో సహా అనేక దేశాలలో ఉత్పత్తి చేస్తారు, అక్కడ దీనిని హిందీలో మునక్కా (సుల్తానా ద్రాక్ష) లేదా కిష్మిష్ (నల్ల ద్రాక్ష) అని పిలుస్తారు. ఇది భారతీయ వంటలలో మృదువైన మరియు తీపి వంటలలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్ధం.

ఎండుద్రాక్షకు ప్రసిద్ధి చెందిన దేశం ఏది?

ప్రపంచవ్యాప్తంగా ఎండుద్రాక్ష ఉత్పత్తి సంవత్సరానికి 320,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో, సుల్తానా ఉత్పత్తిలో యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది, తరువాత చైనా, ఇరాన్ మరియు టర్కీ ఉన్నాయి. ఎండుద్రాక్ష ఉత్పత్తిలో భారతదేశం యొక్క సహకారం: భారతదేశంలో ఏటా 55,000–65,000 మెట్రిక్ టన్నుల ఎండుద్రాక్ష ఉత్పత్తి అవుతుంది.

ప్రపంచంలోనే అత్యధికంగా ఎండుద్రాక్ష ఉత్పత్తి చేసేది ఎవరు?

ప్రపంచంలో అత్యధికంగా ఎండుద్రాక్ష ఉత్పత్తి చేసేది యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ మరియు టర్కీ రెండూ ప్రధాన ఎండుద్రాక్ష ఉత్పత్తిదారులు అయితే, యునైటెడ్ స్టేట్స్ సాధారణంగా కొంచెం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇతర ముఖ్యమైన ఉత్పత్తిదారులలో చైనా మరియు ఇరాన్ ఉన్నాయి, వాటి ఉత్పత్తి పరిమాణం మొదటి రెండు కంటే చాలా తక్కువగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/guava-benefits-for-diabetes-health/health/529589/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870