సిద్దిపేట(Siddipet crime)లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. హాస్టల్ గదిలో విషపదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా తీసుకున్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి(Nimes Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.
Read Also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య

వివరాల్లోకి వెళితే
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య (2020 బ్యాచ్) సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేసి, ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం హాస్టల్ గదిలో అస్వస్థతకు గురైన ఆమెను గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెను నిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ ఐసీయూలో చికిత్స కొనసాగుతుండగా ఆమె ప్రాణాలు విడిచింది.
ఇంటర్న్‌షిప్ ఒత్తిడితో వైద్యురాలి దుర్మరణం?
ఇంటర్న్‌షిప్ బాధ్యతల ఒత్తిడి, అలాగే నీట్ పీజీ పరీక్షల సిద్ధత వంటి కారణాలతో ఆమె మానసిక ఒత్తిడికి లోనై ఉండవచ్చని కాలేజీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన వైద్య విద్యార్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: