हिन्दी | Epaper

President Droupadi Murmu: మమతా బెనర్జీపై ఎలాంటి ద్వేషం లేదు: రాష్ట్రపతి

Aanusha
President Droupadi Murmu: మమతా బెనర్జీపై ఎలాంటి ద్వేషం లేదు: రాష్ట్రపతి

President Droupadi Murmu: పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రోటోకాల్ పాటించడంలో రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం చెందిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీస మర్యాదలు పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Petrol Price Hike : పెట్రోల్ ధరల విషయంలో వాహనదారులకు గుడ్ న్యూస్

ఆదివాసీ సదస్సుకు అనుమతి నిరాకరణ

ఉత్తర బెంగాల్‌లో అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వలేదని, అలాగే రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు ముఖ్యమంత్రి లేదా మంత్రుల నుంచి అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు.ఆదివాసీ సదస్సుకు తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉందని తెలిపారు. దీనికి ప్రభుత్వం అనుమతించకపోవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఇంత చేసినప్పటికీ తనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎలాంటి ద్వేషం లేదని, ఆమె తన సోదరితో సమానమని అన్నారు. కానీ ఆమె కోపంగా ఉండవచ్చని వ్యాఖ్యానించారు.తాను కూడా బెంగాల్ బిడ్డనే అని అన్నారు.

President Droupadi Murmu: No hatred against Mamata Banerjee
President Droupadi Murmu: No hatred against Mamata Banerjee

9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సులో ప్రసంగించడానికి రాష్ట్రపతి బెంగాల్‌లోని సిలిగురికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు స్వాగతం పలకాలి. కానీ అధికారికంగా స్వాగతం పలకడానికి ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు.అంతర్జాతీయ సంతాల్ సదస్సును బిధాన్ నగర్‌లో నిర్వహించాల్సి ఉండగా, అధికారులు సిలిగురిలోని గోసాయిన్‌‍పూర్‌కు మార్చారని ద్రౌపది ముర్ము తెలిపారు. సంతాల్ సదస్సుకు పెద్ద ఎత్తున సంతాల్ ఆదివాసీలు తరలి వస్తుండటం తాను చూశానని, కానీ వారిని కొంతమంది అడ్డుకున్నారని ఆరోపించారు. సంతాల్ జాతీయులు ఏకంకావడం, చదువుకోవడం, బలోపేతం కావడం వారికి ఇష్టం లేనట్లుగా ఉందని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870