మావోయిస్టు(Maoist) అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్(Hidma Encounter)కు సంబంధించి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన వెనుక తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది.
Read also: HYD: మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు.. పార్టీకి గట్టి షాక్

వాయిస్ రికార్డింగ్‌లున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు
ఆ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, హిడ్మాకు వైద్య చికిత్స అవసరమని నమ్మబలికి ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి, తెలంగాణ మార్గంగా కారులో ఆంధ్రప్రదేశ్‌కు తరలించి శత్రువులకు అప్పగించారన్న ఆరోపణలు చేశారు.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాయిస్ రికార్డింగ్‌లు తమ వద్ద ఉన్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
మోసపూరిత మాటలతో హిడ్మాను తమ కబంధంలోకి తీసుకుని, చివరకు ఎన్‌కౌంటర్‌కు గురి చేశారని లేఖలో ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిని ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: