భారతదేశంలో కరెన్సీ నోట్ల విషయంలో ఏ చిన్న రూమర్ వచ్చినా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా నోట్ల రద్దు అనగానే 2016 నవంబర్ 8న జరిగిన సంఘటన చాలామందికి వెంటనే గుర్తుకొస్తుంది. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.1000, రూ.500(500) విలువైన పాత నోట్లు చెల్లవని ప్రకటించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు, నగదు కొరత వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ నిర్ణయం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిజైన్‌లో రూ.500, రూ.2000 కొత్త నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది. కొంతకాలం పాటు ఈ రెండు నోట్లు దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. అయితే కాలక్రమేణా పెద్ద మొత్తాల లావాదేవీలను నిరుత్సాహపరచాలనే ఉద్దేశంతో RBI రూ.2000 నోట్ల వినియోగాన్ని క్రమంగా తగ్గించడం ప్రారంభించింది. చివరకు మే 2023లో రూ.2000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరిస్తామని.. ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చని లేదా మార్పిడి చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది.
Read Also: Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం

రూ.500 నోట్లు చెల్లవని కొన్ని పోస్టులు, మెసేజులు ప్రచారం
ఈ నేపథ్యంతోనే తాజాగా సోషల్ మీడియాలో మరో వదంతి వేగంగా వ్యాపించింది. రూ.2000 నోట్ల మాదిరిగానే, త్వరలోనే రూ.500 నోట్లను కూడా RBI చెలామణి నుండి తొలగించబోతోందని, మార్చి 2026 తర్వాత రూ.500 నోట్లు చెల్లవని కొన్ని పోస్టులు, మెసేజులు ప్రచారం అయ్యాయి. ఈ వార్తలు సామాన్య ప్రజల్లో గందరగోళం, భయాన్ని కలిగించాయి. ప్రస్తుతం భారతదేశంలో చెలామణిలో ఉన్న అత్యధిక విలువ కలిగిన నోటు రూ.500 నోటే. ఏటీఎంలలో ఎక్కువగా లభించే నోటు ఇదే. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకూ, రోజువారీ లావాదేవీల్లో రూ.500 నోటు కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి నోటును అకస్మాత్తుగా ఉపసంహరిస్తారనే వార్తలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వ సమాచార ధృవీకరణ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వాదనలను PIB ఫ్యాక్ట్ చెక్ బృందం పూర్తిగా ఖండించింది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు
మార్చి 2026 నుంచి ఏటీఎంలలో రూ.500 నోట్లు అందుబాటులో ఉండవని.. ఆ తర్వాత వాటిని పూర్తిగా ఉపసంహరిస్తారనే ప్రచారం నకిలీ సమాచారమని స్పష్టం చేసింది. RBI ప్రత్యేకంగా నోట్లను ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకుంటే, అది అధికారిక ప్రకటన ద్వారానే ప్రజలకు తెలియజేస్తుందని పేర్కొంది. అధికారిక సమాచారం లేకుండా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ప్రస్తుతం రూ.500 నోట్లు పూర్తిగా చట్టబద్ధమైనవేనని, అవి లావాదేవీల కోసం స్వేచ్ఛగా ఉపయోగించవచ్చని RBI స్పష్టం చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: