Banana Price Today: గత రెండు నెలల క్రితం వరకు అరటి పంటకు సరైన ధర లభించక తీవ్ర నిరాశలో ఉన్న రైతులకు ఇప్పుడు ఊహించని ఊరట లభించింది. అప్పట్లో టన్ను అరటి ధర కేవలం రూ.1,000 వరకు పడిపోవడంతో పంట ఖర్చులు కూడా రాక రైతులు కన్నీళ్లు పెట్టిన పరిస్థితి నెలకొంది.
Read Also: Minister Rajanarsimha: రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్’: మంత్రి

అరటి పంటతో రైతుల ఇళ్లలో సంక్రాంతి వెలుగులు
కానీ ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం(Anantapur) జిల్లాలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అరటి ధరలు ఒక్కసారిగా పెరిగి మొదటి కోత అరటి టన్నుకు రూ.22,000 వరకు పలుకుతోంది. ఎగుమతుల డిమాండ్ పెరగడం, వాతావరణం అనుకూలంగా ఉండడం, మార్కెట్లో సరఫరా కొరత వంటి కారణాలు ధరల పెరుగుదలకు దోహదపడ్డాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఈ ధరల పెరుగుదలతో అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అరటి సాగు చేసిన రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. సంక్రాంతి పండుగ సమయానికి చేతికి వచ్చిన మంచి ఆదాయంతో అప్పులు తీర్చుకునే అవకాశం రావడంతో పాటు, భవిష్యత్తు సాగుపై ఆశలు పెరిగాయి. గతంలో నష్టాల పాలైన రైతులకు ఇది నిజంగా ఊహించని శుభవార్తగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: