He is my monday motivation.. Anand Mahindra

Anand Mahindra: నా మండే మోటివేషన్‌ ఆయనే : ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఈరోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్‌ను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన యువ ఐఏఎస్‌ అధికారి డి.కృష్ణ భాస్కర్‌ కథనాన్ని పంచుకున్న ఆయన ఆ అధికారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగం గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. భూగర్భ జలాల స్థాయిలను పెంచడంలో దేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో మన అందరికీ బాగా తెలుసు. అలాంటి సమయంలో ఈ యువ ఐఏఎస్‌ అధికారి కృష్ణభాస్కర్‌ సాధించిన విజయాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే. సమస్య ఎలాంటిదైనా దాన్ని అధిగమించగలమని ఆయన మనలో విశ్వాసాన్ని నింపగలిగారు. దానికి కావాల్సిందల్లా దృఢ సంకల్పమే అని రుజువు చేశారు. అందుకే ఆయనే నా మండే మోటివేషన్‌ అని మహీంద్రా ప్రశంసలు కురిపించారు.

నామండే మోటివేషన్‌ ఆయనే  ఆనంద్‌

కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అద్భుత విజయాలు

తెలంగాణకు చెందిన ఐఏఎస్‌ అధికారి దేవరకొండ కృష్ణ భాస్కర్‌ రాజన్న సిరిసిల్లా జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అద్భుత విజయాలు సాధించారు. నీటి కొరతను అధిగమించేందుకు పలు చర్యలు చేపట్టారు. పైపుల ద్వారా నీటి సరఫరా, రిజర్వాయర్లకు భూమి సేకరణ, నీటి వనరుల కోసం పూడికతీత వంటి చర్యలతో నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచారు. నీటి లభ్యతను విస్తృతంగా పెంచడం కోసం రిజర్వాయర్ల సమీపంలో చిన్న ట్యాంకులను ఏర్పాటుచేశారు. ఆయన చర్యలతో నాలుగేళ్లలోనే భూగర్భ జలాల స్థాయిలను ఆరు మీటర్ల మేర పెంచగలిగారు. ఆయనకు సంబంధించి ఓ స్ఫూర్తిదాయక కథనాన్ని గతేడాది జూన్‌లో బెటర్‌ ఇండియా పేజీ పంచుకుంది. ఆ పోస్ట్‌నే తాజాగా ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేస్తూ ఈ యువ అధికారిపై ప్రశంసలు కురిపించారు. కృష్ణకుమార్‌ సేవలకు గానూ 2019, 2020లో వరుసగా రెండుసార్లు ప్రజా పాలనలో ప్రధానమంత్రి అత్యుత్తమ అవార్డును అందుకున్నారు.

Related Posts
సీఎం సిద్ధరామయ్య, భార్యకు క్లీన్ చిట్?
సీఎం సిద్ధరామయ్య, భార్యకు క్లీన్ చిట్?

50:50 పథకం కింద ముడా ద్వారా స్థలాల కేటాయింపులో జరిగిన కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య, బంధువులకు లోకాయుక్త పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. Read more

హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు
Huge explosion at Hayat Nag

హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు ఉదయం ఘోర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి స్టేషన్ ఆవరణలో Read more

అతిశీ సహా ఆ ఇద్దరు కార్యకర్తలపై కేసు నమోదు!

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రోజు ఎన్నికలు జరగబోతుండగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీకి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై కేసు నమోదు Read more

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ: సిఎం
తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ: సిఎం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 40 మంది గాయపడిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు న్యాయ విచారణను ఆదేశించారు. ఈ ఘటన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *