ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలు అసలు ప్రయోజనం సాధించాలంటే అవి నిజంగా పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని 2014-19 టీడీపీ ప్రభుత్వం కాలంలో అమలైన పథకాలు ఇప్పుడు వాస్తవంగా ఫలితాలిస్తున్నాయి. అప్పట్లో చిన్న స్థాయిలో సహాయం అందుకున్న వారు ఇప్పుడు పెద్దలుగా మారి తాము పొందిన దయను మరొకరికి అందించేందుకు ముందుకు వస్తున్నారు.ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును యువ వ్యాపారవేత్త సాత్విక్ మురారి (Satwik Murari) రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఆయన 2016లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్యా పథకం కింద ఐర్లాండ్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో బిజినెస్ మేనేజ్మెంట్‌లో కోర్సు పూర్తి చేసి, అదే దేశంలో ఉద్యోగం పొందారు. ఇప్పుడు ఆయన అక్కడే స్వంతంగా వ్యాపారం ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబుకు వివరించారు.

తానే పొందిన సహాయం.. తానే పంచాలన్న సంకల్పం
తాను పొందిన సహాయానికి కృతజ్ఞతగా, తానే ఇప్పుడు ఇతర పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నట్లు సాత్విక్ చెప్పారు. మెరిట్ ఉన్నా అవకాశాలు లేని విద్యార్థులకు విదేశాల్లో చదివేందుకు స్కాలర్‌షిప్ అందించేందుకు తాను ముందుకొచ్చారు. ఇప్పటికే నలుగురు పేద విద్యార్థులకి ఆ సాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
చిరునవ్వుతో అభినందించిన చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సాత్విక్‌ను హృదయపూర్వకంగా అభినందించారు. “సమాజం ఇచ్చిందాన్ని తిరిగి సమాజానికే ఇచ్చే ఆలోచన గొప్పది,” అని ప్రశంసించారు. యువతలో ఇలాంటి భావం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సాత్విక్‌తో పాటు ఆయనతో కలసి వచ్చిన వారిలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు స్వామిదాస్ కూడా ఉన్నారు.
Read Also : Pawan Kalyan : నాగబాబు పదవిపై పవన్ ఏమన్నారంటే?