हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

HCA : సన్ రైజర్స్ ఆరోపణలపై స్పందించిన హెచ్‌సీఏ

Sudheer
HCA : సన్ రైజర్స్ ఆరోపణలపై స్పందించిన హెచ్‌సీఏ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ పాస్‌ల కోసం ఒత్తిడి తెస్తున్నారని, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని సన్ రైజర్స్ తమ ఈ-మెయిల్‌లో పేర్కొంది. అంతేగాక, ఉప్పల్ స్టేడియంలోని వీఐపీ బాక్స్‌కు తాళం వేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

సన్ రైజర్స్ ఆరోపణలు అవాస్తవం – హెచ్‌సీఏ

ఈ ఆరోపణలపై హెచ్‌సీఏ తాజాగా స్పందించింది. ఈ నెల 29న సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి ఈ-మెయిల్ ద్వారా సమాధానం పంపినట్లు వెల్లడించింది. తమపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఐపీఎల్ పాస్‌ల కోసం ఎవరిపైనా ఒత్తిడి తీసుకురాలేదని హెచ్‌సీఏ తెలిపింది.

HCA
HCA

హెచ్‌సీఏ అధ్యక్షుడిపై ఆరోపణలు అర్థరహితం

హెచ్‌సీఏ అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఎలాంటి టికెట్లు అడగలేదని, కేవలం క్లబ్ కార్యదర్శుల కోసం మాత్రమే టికెట్లను అభ్యర్థించినట్లు పేర్కొంది. ఉప్పల్ స్టేడియం వ్యవహారంలో కూడా తాము ఎలాంటి వివాదానికి దిగలేదని హెచ్‌సీఏ వివరించింది. వీఐపీ బాక్స్‌కు తాళం వేసేలా తాము ఎవరినీ ప్రేరేపించలేదని స్పష్టంచేసింది.

వివాదంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి

ఈ ఆరోపణలతో హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. హెచ్‌సీఏ-సన్ రైజర్స్ మధ్య జరుగుతున్న విభేదాలు ఆ తర్వాతి మ్యాచ్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది. ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా, లేక ఇరు వర్గాలు త్వరలో సమసిపోతాయా అనే అంశంపై అభిమానులు ఉత్సుకతగా ఉన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870